homemade foot scrubs: హోమ్ మేడ్ ఫుట్ స్క్రబ్స్ తో పాదాలను ఇంట్లోనే అందంగా మార్చుకోండి.

ABN , First Publish Date - 2022-09-11T17:03:49+05:30 IST

రోజులో బిజీ షెడ్యూల్‌తో సాధారణంగా పాదాలకు ఎలాంటి ప్రత్యేక శ్రద్ధా తీసుకోలేం.

homemade foot scrubs: హోమ్ మేడ్ ఫుట్ స్క్రబ్స్ తో పాదాలను ఇంట్లోనే అందంగా మార్చుకోండి.

పాదాలు రోజంతా మన శరీర బరువును మోయడం నుండి మనం వేసుకునే రకరకాల పాదరక్షలకు సర్దుకుంటూ, అలవాటు పడుతూ భరిస్తాయి. రోజులో బిజీ షెడ్యూల్‌తో సాధారణంగా పాదాలకు ఎలాంటి ప్రత్యేక శ్రద్ధా తీసుకోలేం. శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగానే, మన పాదాలకు కూడా చర్మ సంరక్షణ అవసరం, దాని కోసం పెద్దగా ఖర్చు చేయనవసరం లేదు. కిచెన్ ర్యాక్‌లోని పదార్థాలతో ఇంట్లో తయారు చేసుకునే ఈ సాధారణ పాదాల ఫుట్ స్క్రబ్స్  అద్భుతాలు చేస్తాయి. అవేంటో చూద్దాం.


ఇంట్లో తయారుచేసుకునే స్క్రబ్స్..

1. లెమన్ ఫుట్ స్క్రబ్

ఈ ఇంట్లో తయారుచేసిన ఫుట్ స్క్రబ్ కోసం, గ్రాన్యులేటెడ్ షుగర్, బాదం నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం అవసరం. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇది గొప్ప బ్లీచింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది పాదాలను శుభ్ర ఉంచడం, దుర్వాసనను లేకుండా చేయడమే కాకుండా, పాదాల నుండి టాన్ తొలగించడంలో కూడా సహాయపడుతుంది. 


2. వనిల్లా, కాఫీ స్క్రబ్

గ్రౌండ్ కాఫీ, కొబ్బరి నూనె, గ్రాన్యులేటెడ్ షుగర్ లేదా బ్రౌన్ షుగర్ తో కొంత వెనీలాను తీసుకోవాలి. ఇది పాదాలను పొడిబారకుండా పని చేస్తుంది. మంచి స్క్రబ్‌ గా ఉపయోగపడుతుంది.


3. మాయిశ్చరైజింగ్ కొబ్బరి నూనె స్క్రబ్

ఈ స్క్రబ్ కోసం కొబ్బరి నూనె, కొంచెం చక్కెర తీసుకోవాలి. కొబ్బరి నూనె ఒక గొప్ప మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తుంది, ఇది పొడిగా, పగిలిన పాదాలకు పగిలిన మడమలకు కూడా అద్భుతంగా చేస్తుంది. స్క్రబ్ చేసిన తర్వాత కొంత సమయం  కొబ్బరి నూనెను అలాగే ఉంచి కడిగేయండి.


4. బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్ స్క్రబ్

బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్ ఈ హోమ్ మేడ్ ఫుట్ స్క్రబ్‌లో ప్రధాన భాగాలు. దీనికి కొన్ని చుక్కల నూనె,  కొంత బేకింగ్ సోడా కలపండి. ఈ పేస్ట్‌తో పాదాలను స్క్రబ్ చేయాలి, కడిగే ముందు కనీసం 20 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి.. ఇలా చేస్తే నూనె మీ అలసిపోయిన పాదాలకు ఉపశమనం చేస్తుంది.


5. వోట్మీల్ ఫుట్ స్క్రబ్

కొన్ని వోట్మీల్, బాత్ సాల్ట్, కొంత బేకింగ్ సోడాకు నీటిని సమాన భాగాలుగా కలపాలి. దీన్ని పాదాలకు అప్లై చేసి, కడిగే ముందు 10 నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి. వోట్మీల్ పాదాలను మృదువుగా చేస్తుంది.


6. లావెండర్, ఉప్పు ఫుట్ స్క్రబ్

అద్భుతమైన వాసనతో పాటు, లావెండర్ ఆయిల్ చర్మంపై గాయాలను నయం చేస్తుంది. కాబట్టి, పాదాలకు లావెండర్ స్క్రబ్ చక్కని మెరుగునిస్తుంది. 

Updated Date - 2022-09-11T17:03:49+05:30 IST