టింకూ ఆనందం!

ABN , First Publish Date - 2022-09-25T06:38:25+05:30 IST

టింకూ అనే చిన్నపాప ఉండేది. ఎల్‌కేజీ చదువుతోంది. తనకు కోతులంటే ఇష్టం. కోతులొస్తే అరటిపండ్లు వాటి దగ్గరకు విసిరేసేది.

టింకూ ఆనందం!

టింకూ అనే చిన్నపాప ఉండేది. ఎల్‌కేజీ చదువుతోంది. తనకు కోతులంటే ఇష్టం. కోతులొస్తే అరటిపండ్లు వాటి దగ్గరకు విసిరేసేది. కోతులనే స్నేహితులుగా భావించేది. ఒక రోజు ఉదయాన్నే ఎదురుగా రెండు కోతులు. అవి కోతుల్లా లేవు. భారీ ఆకారంలో ఉన్నాయి. ఎర్రగా ఉన్నాయి. ‘మీరెవరూ?’ అని టింకూ అడిగింది. ‘మేం చింపాజీలం’ అన్నవి అవి. ‘చింపాంజీలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎక్కడో చూశాను’ అన్నది. అయితే టింకూకి గుర్తు రాలేదు. ఒక చింపాంజీ చేతిలోని జామపండు ఇచ్చింది టింకూకి. దారిలో తీసుకొచ్చామని చెప్పింది. టింకూ జామపండ్లను తిన్నది. తియ్యగా జామపండుందని చెప్పటంతో చింపాజీలు సంతోషపడ్డాయి. అంతలోనే టింకూకు ఆ చింపాజీల కథ గుర్తొచ్చింది. ‘మా తాతయ్య సుమత్రా దీవికి వెళ్లినపుడు చూశాడట మీ జాతిని. మీరు ఉండే ఓ బొమ్మల పుస్తకం నా దగ్గర ఉంద’ని ఆ పుస్తకం చూపించింది టింకూ.


ఆ బొమ్మలు చూశాక ‘ఇంత మంచి స్నేహితురాలు దొరకడం అదృష్టం’ అంటూ చింపాజీలు సంబరపడ్డాయి. బయటికెళ్దాం అన్నది టింకూ. ఓ చింపాంజీ టింకూను తన భుజాల మీద ఎక్కించుకుంది. అడవిలోకి చింపాంజీలు, టింకూ తిరిగారు. కొత్త రకాల పండ్లు తినిపించారు. మంచి నీళ్లు తాగించారు. మళ్లీ ఇంటికొచ్చి టింకూను వదిలారు. టింకూ ఆనందానికి అవధుల్లేవు. ‘మీరు అడవి నుంచి వచ్చినా సరే.. బుద్ధిగా ఉన్నారు. మనుషులతో కలిసి పోతున్నారు. నా లాంటి కిడ్‌తో స్నేహం చేశారు. మళ్లీ రండి’ అంటూ బై చెప్పింది. బడికి పోతూనే తన స్నేహితులందరికీ చెప్పాలి. అంతకంటే ముందు ఆమ్మానాన్నకు చెప్పాలి. తాతయ్యకు ఫోన్‌ చేసి చెప్పాలనుకుంది. అంతలోనే ‘త్వరగా బడికెళ్లాలి. ఇక చాల్లే నిద్రపోయింద’ని అమ్మ నిద్రలేపింది. అప్పుడు టింకూకు చింపాంజీల కథ ‘కల’ అని అర్థమైంది. ఆ కల నిజమైతే ఎంత బావుండో అనుకున్నది. 

Updated Date - 2022-09-25T06:38:25+05:30 IST