కథ

ABN , First Publish Date - 2022-12-21T23:39:13+05:30 IST

ఒక అడవిలో మైటీ పిల్లి ఉండేది. ఆ పిల్లికి గర్వమెక్కువ. ఇష్టమొచ్చినట్లు ఎలుకలను చంపి తినేది.

కథ

క అడవిలో మైటీ పిల్లి ఉండేది. ఆ పిల్లికి గర్వమెక్కువ. ఇష్టమొచ్చినట్లు ఎలుకలను చంపి తినేది. పిల్లి దాడి తట్టుకోలేక.. ఒక తీర్మానాన్ని అంగీకరించాయి. అదేంటంటే.. ప్రతిరోజూ ఒక ఎలుక తన ఇంటికి రావాలి. దాన్ని చంపి తింటుంది. ఇలా చేస్తుంటే కొద్దిరోజులయ్యాక ఎలుకల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో ఎలుకల రాజు మైసి దగ్గరకు నాలుగు ఎలుకలు గుంపుగా వచ్చాయి. ‘రాజావారు.. మీరు కాస్త ఆలోచించండి. ఇలా ఉంటే మన జాతి ఏమవుతుంది?’ అంటూ బాధపడ్డాయి. కాసేపు మాట్లాడుకున్నాయి. చర్చించాయి. చివరికి ఎలాగైనా సరే మైటీ క్యాట్‌ను అడవి నుంచి తరిమికొట్టాలని అనుకున్నాయి. అంతలో ఎలుక రాజుకు ఓ ఆలోచన వచ్చింది. పిల్లి ఇంటి దగ్గర నా మిత్రుడున్నాడు. అక్కడికి వెళ్దాం పద అన్నది. అందరూ దాని వెంట వెళ్లారు. తలుపు కొట్టగానే.. ఇంట్లోంచి శునకం వచ్చింది. తన మిత్రుడిని చూసి సంతోషించింది. తన మిత్రుడితో పాటు మిగతా ఎలుకలకు మర్యాదలు చేసింది. విషయం ఏమిటని అడిగింది శునకం. తన మిత్రుడు ఎలుకలకు జరుగుతోన్న ఘోరం చెప్పింది. ‘దయచేసి దాని బారిన పడకుండా చేయండి’ అంటూ వేడుకున్నాయి ఎలుకలు. శునకానికి బాధనిపించింది. ఇలా ఇంటికి రమ్మని ఎలుకలు తినేసే పిల్లిని తరిమికొట్టాలనుకుంది. మరుసటి రోజు ఒక ఎలుక వెంబడి శునకం మైటీ ఇంటికి వెళ్లింది. ఎలుక పీక పట్టుకునే సమయంలో శునకం వచ్చి క్షణాల్లో పిల్లి మెడ గట్టిగా పట్టుకుంది. పిల్లి మెడ తిరగలేదు. పైకి చూస్తే నాలుక బయటపెట్టి, దంతాలతో శునకం కనపడగానే.. పిల్లి ప్రాణాలు గాల్లోకి పోయాయి. ‘దేవుడా..నన్ను వదిలేయండి. నా ప్రాణం మీకు అవసరమా?’ అంటూ వేడుకుంది పిల్లి. శునకం నోటితో పిల్లి గొంతు పట్టుకుని నీళ్లలోకి విసిరేసింది. శునకం వెంట వచ్చిన ఐదు ఎలుకలకు ఆశ్చర్యం వేసింది. అలా చూస్తుండిపోయాయి. క్షణాల్లో నీళ్లలోకి దూకి పిల్లి తోకను పట్టుకుని ఈడ్చుకుని వచ్చింది శునకం. ‘నీ ఇంటి దగ్గరకే ఎలుకలు రావాలా? ఇంత సోమరివా? నీ తిండి కోసం ఇతరులు ప్రాణాలు తీసుకోవాలా?’ అంటూ శునకం గట్టిగా అరిచింది. ఇక ఈ అడవిలోనే ఉండను. తప్పు చేశాను. క్షమించమని వేడుకుంది పిల్లి. శునకం వదిలేసింది. బతుకు జీవుడా... అంటూ పిల్లి అడవికి దూరంగా వెళ్లిపోయింది. అప్పటినుంచి ఎలుకలంతా సంతోషంగా ఉన్నాయి.

Updated Date - 2022-12-21T23:39:14+05:30 IST