కుందేలు కొత్త స్నేహం!

ABN , First Publish Date - 2022-09-24T05:41:54+05:30 IST

ఒక అడవిలో కుందేలు ఉండేది.

కుందేలు కొత్త స్నేహం!

క అడవిలో కుందేలు ఉండేది. అది ఉదయాన్నే నీళ్లు తాగటానికి ఓ కొలనుకు వెళ్లింది. అక్కడ బుడగలొస్తుంటే దానికి సందేహం కలిగింది. ఇక్కడ మొసళ్లు లేవు.. లోపల ఏ జంతువుందోనని కంగారుగా వెనక్కి వచ్చింది. బుడగలలోపలనుంచి ఓ జంతువు వచ్చింది. చూడటానికి భయంకరంగా ఉంది.. దాని నోరు చూస్తే. వెనక్కి పరిగెత్తింది. వెనకాల ఆ జంతువు వెంబడించింది. కానీ కుందేలు దొరకలేదు. ‘నేను హిప్పో’ను.. నిన్ను తినను’ అంటూ అరిచింది. ‘ఏనుగు, ఖడ్గం తర్వాత నువ్వే భారీ శరీరం అంట కదా. మా అమ్మ చెప్పింది’ అన్నది కుందేలు. అవునా! అంటూ ఆశ్చర్యపోయింది. చాలా బరువుంటాం. నీకేమీ హాని చేయను. పగలు పూట సూర్యకాంతి నా మీద పడితే ఇబ్బంది పడతా అంది. ‘ఇంత గట్టిగా చర్మం ఉంటే నీకేమౌతుంది’ అన్నది కుందేలు. పగటి పూట బయటికి రావటం ఇబ్బందే. అందుకే నీళ్లలో ఉంటానంది హిప్పో. ‘ఇంత బరువు ఉంటావు. భలే ఈదుతావే’ అన్నది కుందేలు. బరువుంటా. అందుకే నీటిలోపలకి పోతా. కింద నడుస్తా. అంతే కానీ ఈదలేను అన్నది. ‘నువ్వు భలే మాట్లాడుతున్నావు హిప్పో’ అంటూ కుందేలు నవ్వింది. హిప్పో ఏడ్చింది.


‘ఇంత భారీ జంతువు. ఏడిస్తే బావుండదు. దయచేసి ఏడ్వకు’ అన్నది కుందేలు. ‘నేను ఒంటరిని. మేం ఇరవై మందిమి కలిసి ఉంటాం. తప్పిపోయి ఇటొచ్చా. మా వాళ్లను ఎక్కడ వెతకాలో తెలీలేదు’ అంటూ గట్టిగా ఏడ్చింది హిప్పో. ‘హలో.. హిప్పో మిత్రమా.. నాకు పావురం మిత్రుడు ఉన్నాడు. గాల్లో చక్కర్లు కొట్టి మీ వారి జాడ కనుక్కుని మనకు చెబుతాడు. అప్పుడు మీ వాళ్లను చేరుకుందువులే’ అన్నది కుందేలు. హిప్పో చాలా సంతోషపడింది. హాయిగా నవ్వింది. ‘నీకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అన్నది. బెంగతో ఏమీ తిననట్లున్నావు. అడవిలో ఫలాలున్నాయి. నువ్వు తిందువుకానీ అంటూ కుందేలు తన వెనకాల తీసుకెళ్లింది హిప్పోను. అంత మంచి స్నేహాం చూసి ‘లక్కీ’ అనుకుంది హిప్పో. కుందేలు కూడా ఇంత మంచి అమాయకుడైన నా స్నేహితుడు ఉండటం లక్కీనే అనుకుంది. ఇతన్ని తన వారి దగ్గరకు చేరిస్తే ఓ పని ఐపోతుందనుకుంది. అంతలోనే పావురం వచ్చింది. కుందేలు దానికి హిప్పో కథ చెప్పింది. సాయంత్రానికి జాడ తెలుసుకుంది పావురం. మరుసటి రోజు ఉదయాన్నే కుందేలు, పావురం తీసుకెళ్లి హిప్పోను తన కుటుంబంతో కలిసేట్లు చేశారు. 

Read more