baby to sleep through the night: ఈ చిట్కాలతో పసిపిల్లల్ని ఇలా నిద్రపుచ్చండి..

ABN , First Publish Date - 2022-09-27T19:55:46+05:30 IST

పిల్లలు రాత్రంతా గోల చేసి నిద్రపోకపోయినా పగలు స్నానం తరవాత పాలు తాగి నిద్రపోతారు.

baby to sleep through the night: ఈ చిట్కాలతో పసిపిల్లల్ని ఇలా నిద్రపుచ్చండి..

కొత్తగా తల్లిదండ్రులైన వారిలో ఆందోళన కలిగించే విషయం.. వారి నవజాత శిశువు రాత్రి పూట నిద్రపోకపోవడమే. అప్పుడే పుట్టిన బిడ్డల్లో ఆహారం కోసం కంటే నిద్ర అవసరం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు రాత్రంతా గోల చేసి నిద్రపోకపోయినా పగలు స్నానం తరవాత పాలు తాగి నిద్రపోతారు. కానీ నిద్రలేక బాధపడేది తల్లిదండ్రులే. ఇది వారిలో రోజంతా చికాకు, అలసటకు గురిచేస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డలు 0-3 నెలల వారు రాత్రిళ్ళు మేల్కొనే ఉంటారు. ఇది పిల్లలు పెరిగే దశ. తర్వత తర్వత నిద్ర సరైన క్రమంలోకి మారుతుంది. సమస్యల్లా మొదటి నెలల్లోనే.. దీనినే ప్రతి తల్లిదండ్రులు సరిగ్గా ఫ్లాన్ చేయాలి.. అదెలాగో చూద్దాం.


1. అప్పుడే పుట్టిన బిడ్డలు 0-3 నెలలు సరైన నిద్రవేళలు కలిగి ఉండరు. ఆహారం కోసం ప్రతి 3-4 గంటలకు లేస్తూ ఏడుస్తూ ఉంటారు. అదే కాస్త 4-6 నెలల వయసున్న పిల్లలు ప్రతి 6 గంటల పాటు నిద్రపోతారు. సాధారణంగా 6నెలల వయస్సు తరవాత నిద్రావిధానం చక్కబడుతుంది. ఇది శిశివు ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.


2. పిల్లలు రాత్రంతా నిద్రపోకపోవడానికి ఇతర కారణాలు కూడా ఉంటాయి. తడి కాటన్ నాపీ, అలాగే సౌకర్యంగా లేని పక్కా, మంచం ఇలా ఇతర కారణాలు కావచ్చు. తల్లిదండ్రులు శిశివు నిద్ర పోయేలా చూసుకోవాలి.


3. నిద్రవేళను సరిచేయండి..

రాత్రిపూట శిశువును నిద్రపోయేలా చేయడం వల్ల రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడం ఉదయం పని చేయడం అలవాటు చేసుకోవడం. ఆహారం ఇవ్వడం, లాలీ పాటలు పాడటం, పుస్తకం చదవడం, కథలు చెప్పడం వంటి స్థిరమైన నిద్రవేళలు పిల్లాలను నిద్రపోయేలా చేస్తాయి. 


4. సాయంత్రం పూట మసాజ్ చేయడం, నిద్రవేళకు ముందు స్నానం చేయడం వంటి చర్యలు నిద్రను ప్రేరేపిస్తాయి. అదేవిధంగా, శిశువుతో ఆడుకోవడం కూడా శిశువును అలసిపోతుంది.


5. ప్రశాంతమైన వాతావరణం..

గది వాతావరణం మసకగా, చీకటిగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. చిన్నశబ్దం లేకుండా ఉండేలా చూసుకోవచ్చు. 


6. రాత్రిపూట డైపర్లకు మారండి.

రాత్రి మేల్కొలపడానికి చాలా సాధారణ కారణం తడి న్యాపీ. శరీరంపై చల్లని, తడి గుడ్డ శిశువుకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. రాత్రిపూట డైపర్లను ఉపయోగించడం ఉత్తమం. 


7. పగటిపూట పిల్లవాడిని మేల్కొని ఉంచండి.

శిశువును రోజులో ఎక్కువ సమయం మేల్కొని ఉంచడం ఉత్తమం. ఇది రాత్రిపూట శిశువును అలసిపోతుంది. చాలామంది పిల్లలు రోజుకు 16 నుంచి 18 గంటలు నిద్రపోతారు. చాలా కారణాలతో రాత్రిపూట మేల్కొంటారు. ఇందుకు ఆకలి, అసౌకర్యం కారణాలు కావచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా పిల్లలు రాత్రిపూట నిద్రపోకుండా గోలచేస్తారు. ఈ చిట్కాలు పాటించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా, ప్రశాంతంగా పెరుగుతారు. 

Updated Date - 2022-09-27T19:55:46+05:30 IST