Monkey Buffet Festival: మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-12-28T02:58:56+05:30 IST

ఈ థాయ్‌లాండ్‌లోని లోప్‌బరి నగరంలో కోతుల పండగ చేస్తారు. దీన్నే కోతుల బఫెట్‌ ఫెస్టివల్‌ అని కూడా పిలుస్తారు.

Monkey Buffet Festival: మీకు తెలుసా?

ఈ థాయ్‌లాండ్‌లోని లోప్‌బరి నగరంలో కోతుల పండగ చేస్తారు. దీన్నే కోతుల బఫెట్‌ ఫెస్టివల్‌ అని కూడా పిలుస్తారు.

ఈ ప్రతి ఏటా నవంబర్‌లో జరిగే ఈ పండగలో కొన్ని వేల వానరాలు అరటికాయలు, దోసకాయలు, కోడిగుడ్లు, స్వీట్లు, తాజా కూరగాయలు, పండ్లు, ఐస్‌ క్రీమ్స్‌, నూడిల్స్‌తో పాటు కూల్‌డ్రింక్స్‌ తాగుతూ తమకు ఇష్టమైన ఆహారాన్ని లాగిస్తుంటాయి. అన్నీ కలిపి కొన్ని టన్నుల ఆహారపదార్థాలు వానరాలకు ఇస్తారంటే.. వారికెంత విశ్వాసమో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఇంకో విచిత్రమేంటంటే.. ఆ పండగ సమయంలో స్థానికంగా పనిచేసే చెఫ్‌లు వంటలు వానరాలకోసం వండుతారు. మన బఫెట్‌లాగే పొడవైన టేబుళ్లు వేసి వాటిపై ఆహారాన్ని ఉంచుతారు.

ఈ లోప్‌బరి నగరంలోని కమెర్‌ ఆలయంలో కొన్ని వందల కోతులు తిరిగేవి. వీటిని స్థానిక ప్రజలు ఇష్టపడతారు. విషయమేంటంటే.. ఈ పండగకు ఓ నేపథ్యముంది. అదేంటంటే.. రామాయణం. రాముడి భక్తుడయిన ఆంజనేయుడంటే వానరమే కదా. ఆంజనేయుడిని వానరాల్లో చూసుకుంటూ ఇక్కడ పండగ చేయటం ప్రారంభించారు స్థానికులు. ఇలా మంకీ ఫెస్టివల్‌ జరిపితే మంచి జరుగుతుంది, అదృష్టం కలిసొస్తుందనేది ఇక్కడ వాళ్ల నమ్మకం.

ఈ 1989లో ఓ వ్యాపారవేత్త టూరిస్టులను ఆకర్షించడానికి ఈ పండగను సెలబ్రేట్‌ చేశారని కొందరంటుంటారు. ఏదేమైనా ఈ పండక్కి ప్రతి ఏటా నవంబర్‌లో విదేశీ టూరిస్టులతో కళకళలాడుతుంది ఈ నగరం.

ఈ ఈ పండగలో కొందరు యువత అవసరమున్న వికలాంగులకు వీల్‌చైర్లు లాంటివి దానం చేయటం లాంటి మంచి పనులు చేస్తారు.

ఈ ఏటా ఈ పండగకు లక్షమందికి పైగా హాజరవుతారని అంచనా.

Updated Date - 2022-12-28T02:58:58+05:30 IST