World Diabetes Day: పిల్లల్లోనూ పెరుగుతున్న డయాబెటిస్ సమస్య..

ABN , First Publish Date - 2022-11-14T12:03:37+05:30 IST

పిల్లల వరకూ డయాబెటిస్ రాదనే ఆలోచనతో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడంలో వెనకబడిపోతున్నాం. .

World Diabetes Day: పిల్లల్లోనూ పెరుగుతున్న డయాబెటిస్ సమస్య..
డయాబెటిస్

మధుమేహం అనేది మనం తీసుకునే ఆహారం నుండి ఉత్పత్తి అయ్యే గ్లూకోజ్‌ను ప్రాసెస్ చేయడంలో, వినియోగించుకోవడంలో శరీరం విఫలమయ్యే రుగ్మత. గ్లూకోజ్ శరీరంలో శక్తి ప్రధాన వనరు. మధుమేహం హృదయ సంబంధ సమస్యలు, నరాల దెబ్బతినడం, మూత్రపిండాలు దెబ్బతినడం, పాదాలకు నష్టం, చర్మ వ్యాధులు, అంగస్తంభన, నిరాశ, దంత సమస్యలు మరిన్ని ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు.

ప్రపంచ మధుమేహ దినోత్సవం (WDD)

ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్ (IDF) ప్రకారం, మధుమేహం వల్ల 2021లో 67 లక్షల మంది మరణించారు. అదే సంవత్సరంలో 53.7 కోట్ల మంది ఈ వ్యాధితో జీవిస్తున్నారని అంచనా. ఈ సంఖ్య క్రమేపి పెరుగుతుందని ఒక సూచన కూడా ఉంది. 2030లో 64.3 కోట్లకు చేరుతుందని 2045 నాటికి 78.3 కోట్లకు చేరుకుంటుందనేది మరో భయపెట్టే నివేదిక.

అయితే పెద్దవారిలో మాత్రమే వస్తుందనుకునే డయాబెటిస్ ఇప్పుడు పిల్లల్లోనూ కనిపిస్తుంది. ఈ సమస్య పిల్లల్లో తెలియకుండా పాకుతుంది. పిల్లల వరకూ డయాబెటిస్ రాదనే ఆలోచనతో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడంలో వెనకబడిపోతున్నాం. అయితే కొన్ని లక్షణాలతో ఈజీగా దీనిని గుర్తించవచ్చు తొందరగా చర్యలు తీసుకోవచ్చు అవేంటో చూద్దాం.

చిన్నారుల్లో డయాబెటిస్ లక్షణాలు..

చాలా వరకూ చిన్నారుల్లో అంత త్వరగా ఈ లక్షణాలు బయటకు కనిపించవు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరెషన్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.1 మిలియన్ల పిల్లల్లో 20 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న వారిలో టైప్ 1 డయాబెటిస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక అనారోగ్య సమస్య.

పిల్లలు ఎక్కువగా నీరు తాగుతుంటే కనుక తప్పక అనుమానించాల్సిందే.. ఈ అధిక దాహం కూడా డయాబెటిస్ వచ్చిందనే దానికి సూచన కావచ్చు. దీనితో అతిగా మూత్రవిసర్జన చేస్తూ ఉంటారు. దీనిని గమనించాలి.

స్పర్శ కోల్పోవడం

పిల్లల్లో కొన్నిసార్లు కాళ్ళకు, చేతులకి ఎలాంటి గాయాలూ లేకపోయినా స్పర్శను కోల్పోతారు. ఈ సమస్య ముదిరి పెద్దదిగా మారేలోపు మేల్కోవడం మంచిది.

కడుపు నొప్పి..

చిన్నారులు అప్పుడప్పుడు కడుపునొప్పి వస్తుంటుంది. ఇది ఎక్కువగా జీర్ణశక్తి లోపించినప్పుడు అనుకుంటాం. కానీ, కొన్ని సార్లు షుగర్ వ్యాధి ఉన్నా కడుపు నొప్పి అంటూ ఇబ్బంది పడతారు.

దృష్టిలోపం..

మధుమేహానికి మరో చిహ్నం కళ్లు కనిపించకపోవడం. చిన్నారులు చాలా సార్లు తమకు సరిగా కనిపించడం లేదని చెబుతారు. షుగర్ వ్యాధి ఉన్నా ఇదే సమస్య కనిపిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

పిల్లలలో టైప్ 1 డయాబెటిస్‌ను జువెనైల్ డయాబెటిస్ లేదా ఇన్సులిన్-ఆధారిత మధుమేహం అని పిలుస్తారు. ఆహారం జీర్ణం అయినప్పుడు చక్కెర రక్తంలోకి ప్రవేశిస్తుంది. తగినంత ఇన్సులిన్ లేకుండా, పిల్లల రక్తప్రవాహంలో చక్కెర పెరుగుతుంది. ఇది చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రాణాంతక సమస్యలను కలిగిస్తుంది.

సాధారణంగా పిల్లలకు టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో జన్యుపరమైన, పర్యావరణ లోపాలు కారణం కావొచ్చు. టైప్ 1 డయాబెటిస్ మెల్లిటిస్ దగ్గరి బంధువులలో ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో దగ్గరి బంధువులకు ఎవరైనా ఉంటే ఈ వ్యాధి పిల్లలకు 0.4 శాతం పిల్లలకి వస్తుంది. ఇక అదే తల్లికి ఉంటే పిల్లలకు 1 నుంచి 4 శాతం వరకు వస్తుంది. అదే విధంగా ఒక వేళ తండ్రికి ఉంటే వారి పిల్లలకు 3 నుంచి 8 శాతం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

పిల్లలు మధుమేహం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని బయట ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, రన్నింగ్ రేస్.. ఇలాంటి అవుట్ డోర్ గేమ్స్‌లో పాల్గొనేలా చేయాలి. శ్రమకి గురవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి జబ్బులు దరిచేరవు.

మంచి ఆహారం తీసుకునేలా చూడాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి. అదే విధంగా జంక్ ఫుడ్‌కి దూరం చేయాలి.

పౌష్ఠికాహారం తీసుకునేలా చూడాలి.

  1. వ్యాయామం చేసేలా చూడాలి. మీతో పాటు వ్యాయామం చేయించాలి.

  2. తొలిదశలోనే వ్యాధిని గుర్తించడం వల్ల చాలా వరకూ సమస్య దూరం అవుతుంది.

  3. కొన్ని జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో దీనిని నివారించవచ్చు.

Updated Date - 2022-11-14T12:24:00+05:30 IST

Read more