Tips To Baby-Proof : మీ పిల్లాడు పారాడుతుంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి...!

ABN , First Publish Date - 2022-09-30T13:08:19+05:30 IST

పిల్లలు పుట్టిన ఆరునెలల తరవాత పాకడం అనేది బిడ్డల పెరుగుదలలో వేసే పెద్ద అడుగు. దీని తర్వాత నెమ్మదిగా నించుని తరవాత నడకకు సాధన చేస్తారు.

Tips To Baby-Proof : మీ పిల్లాడు పారాడుతుంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి...!

పిల్లలు పుట్టిన ఆరునెలల తరవాత పాకడం అనేది బిడ్డల పెరుగుదలలో వేసే పెద్ద అడుగు. దీని తర్వాత నెమ్మదిగా నించుని తరవాత నడకకు సాధన చేస్తారు. ఆరు నుంచి తొమ్మిది నెలల వయస్సులో ఉన్నప్పుడు పాకడం మొదలు పెడతారు. కొత్తగా పేరెంట్స్ అయిన వారు పిల్లలు పాకడానికి వీలుగా ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల పిల్లలు అనుకోకుండా ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు. అదేలాగో తెలుసుకుందాం.


పిల్లలకి పారాడే వయసు వచ్చింది అనేసరికి ఇంట్లో ఉండే విరిగిన కిటికీలు, విరిగిన ఫర్నిచర్ ని తీసివేయండి. ఇది ఎప్పుడైనా ప్రమాదానికి దారితీయవచ్చు. అలాగే పైపులు, పెయింట్ డబ్బాలు తీసి వేరే చోట భద్రపరచండి. టీవీని టేబుల్, చిన్న కబోర్డ్స్ మీద కాకుండా గోడకు వేలాడేలా ఏర్పాటు చేయండి. 


శుభ్రం కూడా అవసరమే..

పిల్లలు పాకుతున్నారంటే ఆ నేలంతా చాలా శుభ్రంగా ఉండాలి. ఇది వారికి ఎలాంటి ఎలర్జీలు రాకుండా కాపాడుతుంది. నేలంతా చాపలాంటిదో, లేదా దుప్పటి పరిచినా కూడా పిల్లలు పాకడానికి వీలుగా ఉంటుంది. కింద ఆడే సమయాల్లో పిల్లలు ఎంత వద్దని వారించినా ఏదో రకంగా నోట్లో బొమ్మల్ని పెట్టుకుంటూ ఉంటారు. ఇది కూడా అనారోగ్యాలను తెచ్చి పెడతుంది. కాబట్టి పిల్లలు ఆడుకునే టాయ్స్ ని ప్రతిరోజూ బాయిల్ చేసి లేదా శానిటైజ్ చేసి ఇవ్వడం మంచిది.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి..


1. బాత్రూమ్ ఎప్పుడూ తాళం వేసి ఉండేలా చూసుకోవాలి. నీటి తొట్టెలను దూరంగా ఉంచాలి.


2. హానికలిగించే క్లీనర్ లను పిల్లలకు దూరంగా ఉంచండి.


3. సాకేట్స్, వైర్స్ కిందకు లేకుండా జాగ్రత్త పడాలి. కరెంట్ కి సంబంధించిన వస్తువులు నేలమీద అందేలా ఉంచకూడదు. కిందకు గోడకు ఉండే స్విచ్ బోర్డ్స్ కి ఫ్లాస్టర్ వేయడం, అట్టలతో కవర్ చేయడం మంచిది.


4. చిన్నపిల్లలు సాకేట్స్, స్విచ్ బోర్డ్స్ పట్టుకోవాలని చూస్తారు వేలు పెట్టాలని చూస్తారు ప్రమాదాన్ని ముందే ఊహించి వాటికి దూరంగా ఉండేలా చూడాలి. 


5. గాజు వస్తువులను దూరంగా ఉంచండి. పూల కుండీలు, ఫ్లవర్ వాజ్ లను దూరంగా ఉంచాలి. తీవాచీలు, కార్పెట్ లను తీసివేయండి. వీటిని పిల్లలు పాకుతూ వచ్చి నోటిలో పెట్టుకుంటారు, కాబట్టి నేల మీద చాపను పరచడం వల్ల దుమ్మూ ధూళీ పెద్దగా అంటుకునే సమస్య ఉండదు.

Updated Date - 2022-09-30T13:08:19+05:30 IST