అందరూ కలిసి ఆలోచిస్తే...

ABN , First Publish Date - 2022-09-21T06:01:33+05:30 IST

ఒక అడవిలో రెండు కుందేళ్లుండేవి. అడవంతా తిరుగుతూ సందడి చేసేవి. నచ్చిన ఆహారం తిని బతికేవి.

అందరూ కలిసి ఆలోచిస్తే...

క అడవిలో రెండు కుందేళ్లుండేవి. అడవంతా తిరుగుతూ సందడి చేసేవి. నచ్చిన ఆహారం తిని బతికేవి. ఒక రోజు సరస్సు గట్టుకు నీళ్లు తాగటానికి వెళ్లాయి. క్షణాల్లో ఒక రాయి గాల్లోకి ఎగిరినట్లనిపించింది.. ఉచ్చు బిగుసుకుంది. వలలో బంధీ అయ్యాయి. ‘అరే ఎంత బాగున్నాయో బుజ్జి కుందేళ్లు’ అన్నాడు వేటగాడు మరో వేటగాడితో. కుందేళ్లను ఒక ఓపెన్‌ ఆటోలో వేశాడొకడు. అక్కడ చూస్తే రెండు తాబేళ్లు, ఒక కోతి ఉంది. ‘మీరు కూడా చిక్కారా..’ అన్నట్లు అవి చూశాయి. వేటగాళ్లిద్దరూ ‘ఒక జింక పడితే చాలు’ అనుకుంటూ అడవిలోకి వెళ్లారు. కుందేళ్లు, తాబేళ్లు, కోతి బాధపడ్డారు. కోతిని గొలుసుతో కట్టేశారు. జింకను కూడా తీసుకొచ్చి దాన్ని కట్టేసి ట్రక్‌లో వేశారు. జింక కన్నీళ్లు ఆగటం లేదు. 


‘ఏదైనా ఉపాయం చెప్పవా’ అని కోతిని అడిగిందో కుందేలు. ‘అంతా అయిపోయింది. మనల్ని నగరానికి తీసుకెళ్తారంట’ అంటూ గట్టిగా ఏడిచింది. కుందేళ్లు రెండూ బాగా ఆలోచించాయి. బాధతో పైకి చూస్తూనే కందిరీగల తుట్టె కనిపించింది. ఒక కుందేలు భుజంపై మరో కుందేలు ఎక్కి ఆ తుట్టెను కదిలించింది. అంతే పైన ఉండే కుందేలు వేళ్లను కుట్టాయి. తాబేళ్లు ముడుచుకున్నాయి. కోతికి కుట్టాయి. గట్టిగా అరవండని కుందేళ్లకు కోతి చెప్పింది. అన్నీ గట్టిగా అరిచాయి. ఇద్దరు వేటగాళ్లు జంతువులకు ఏమయిందోనని వెనక్కి వచ్చారు. క్షణాల్లో కందిరీగలు వారిపై దాడి చేశాయి. ఆ దాడికి తట్టుకోలేక నొప్పితో విలవిల్లాడుతూ అడవిలోకి చాలా దూరం పరిగెత్తారు. అయినా అవి వాళ్లను వదల్లేదు. ఈ లోపు రెండు కుందేళ్లు పొడవాటి దంతాలతో వలను గట్టిగా కొరికాయి. వలలోంచి బయటపడ్డాయి. జింకను, కోతిని తప్పించాయి. తాబేళ్లను ఆటోకింద వదిలింది కోతి. జంతువులన్నీ అక్కడనుంచి పారిపోయాయి. 

Read more