Anxiety; కోవిడ్ తరువాత పిల్లల్లో Anxiety భిన్నంగా కనిపిస్తుందా..?

ABN , First Publish Date - 2022-10-14T18:33:50+05:30 IST

పిల్లల్లో ఒంటరితనం, గృహనిర్భంధం మానసిక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని నివేదికలు చెపుతున్నాయి.

Anxiety; కోవిడ్ తరువాత పిల్లల్లో Anxiety భిన్నంగా కనిపిస్తుందా..?

కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టాకా, లాక్ డౌన్ తరవాత పిల్లల మానసిక పరిస్థితిలో మార్పులు వచ్చాయి. చాలావరకూ పిల్లలు ఆందోళనతో బాధపడుతున్నారు. ఆర్థిక పరమైన ఒత్తిడి పెద్దలపై ప్రభావం చూపితే, పిల్లల్లో ఒంటరితనం, గృహనిర్భంధం మానసిక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని నివేదికలు చెపుతున్నాయి. 


కాబట్టి పిల్లల్లో anxiety..

పిల్లల్లో కలిగే ఈ ఆందోళనను ఎలా పసిగట్టాలి. 

ఈ ఆందోళన లక్షణాలు పిల్లల నుంచి పిల్లలకి వయస్సును బట్టి మారుతూ ఉంటుంది. గతంలో పిల్లలు కదిలి, పరిగులెత్తుతూ ఆడుకునేవారు. దీనితో కాస్త శరీరానికి మానసికోల్లాసం కలిగేది. రోజంతా ఉత్సాహంగా ఉండేవారు. మరి ఇప్పుడు ఆ అవకాశాలు తగ్గాయి. నలుగురితో కలిసి ఆడితే కోవిడ్ లక్షణాలు వస్తాయేమో అనే భయం ఇంకా తల్లిదండ్రులలో పోలేదు. అలాగే పిల్లలకి ఉత్సాహాన్ని ఇచ్చే క్రీడలు కూడా లేకపోవడం, చదువు ఒత్తిడిలు భావోద్వేగ నియంత్రణలో మార్పులు కనిపిస్తున్నాయి. మాట్లాడితే కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం, గోర్లు కొరకడం, ఇంట్లో వారితో అత్తుక్కుని తిరగడం.


ఇక శరీరక లక్షణాలలో మార్పులు..

తలనొప్పి, కడుపు నొప్పి, అలసట, పేలవంగా ఉండడం, ఏకాగ్రత లేకపోవడం, అతి నిద్ర, ఆకలి లక్షణాలుగా ఉంటాయి. 


ఆందోళన నుంచి ఉపశమనం ఇలా..

1. పిల్లలు ఆందోళన నుంచి రిలీఫ్ కావాలంటే తగినంత నిద్ర అవసరం. నిద్ర సరిగా పోవాలంటే ఆటలు ఆడించండి.

2. 5 నుంచి 7 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు తొమ్మిది నుంచి 11 గంటల మధ్య నిద్ర, గంట వ్యాయామం అవసరం. 

3. మానసిక ఆరోగ్యం బావుండాలంటే తాజా కూరగాయలు, పండ్లు, చిక్కుళ్ళు, ప్రోటీన్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

4. స్నేహితులతో కనెక్ట్ అయ్యేలా చూడాలి. తోటి పిల్లలతో ఆడుకోవడం, సన్నిహితంగా ఉండటం ఆందోళన తగ్గించడంలో సహకరిస్తుంది.

5. పిల్లలు యుక్తవయస్సులో ఉన్నప్పుడు తల్లిదండ్రులే పిల్లల జీవితాల్లో ముఖ్యమైన వ్యక్తులు.


పిల్లల మానసిక ఆనందాన్ని పెంచేలా వారికి ఇష్టమైన వంటకాలను చేయడమో, నచ్చిన ప్రదేశాలను చూపించడమో, పడుకునే సమయంలో వారితో సమయాన్ని గడపడమో చేస్తూ ఉండాలి. ఒంటరితనం అంటే చిన్నతనం నుంచి అనుభవంలోకి వచ్చిన పిల్లలు పెరుగుతున్న కొద్దీ మరింత ఒంటరిగా ఉండడానికి అలవాటు పడతారు. 

Updated Date - 2022-10-14T18:33:50+05:30 IST