మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-09-26T08:20:53+05:30 IST

గుడ్లగూబల్లో ‘గ్రేట్‌ హార్న్డ్‌ గుడ్లగూబలు’ ఒకరకం. టైగర్‌ ఔల్స్‌ అని కూడా పిలుస్తారు.

మీకు తెలుసా?

గుడ్లగూబల్లో ‘గ్రేట్‌ హార్న్డ్‌ గుడ్లగూబలు’ ఒకరకం. టైగర్‌ ఔల్స్‌ అని కూడా పిలుస్తారు. వీటి సైంటిఫిక్‌ నేమ్‌.. బుబో విర్జినియన్స్‌

శరీరం 18 ఇంచుల నుంచి 25 ఇంచులు ఉంటుంది. 

దక్షిణ అమెరికాలోని అడవులు, నీటి అడవులు, ఎడారులు, జన ఆవాసం ఉండే ప్రాంతాల్లో కూడా ఇవి ఉంటాయి.

రెటీనాలో ఉన్న నిర్మాణం వల్ల దూరంగా ఉండే వస్తువులను చక్కగా చూడగలుగుతాయి.

రాత్రి ఎనిమిదిన్నర నుంచి తెల్లారుజామున 4.30 వరకూ మాత్రమే వేటాడుతాయి. పగలంతా గూళ్లలో నిద్రపోతాయి.

కొన్ని రకాల పక్షులు, ఎలుకలు, కుందేళ్లను వేటాడుతుంది. 

అన్ని గుడ్లగూబల్లాగే దాని గూళ్ల దగ్గరకు పోయినపుడు, పిల్లల జోలికి మనుషులు వెళ్లినపుడు ఏమాత్రం ఆలోచించకుండా దాడి చేస్తాయి. అతి వేగంగా వచ్చి ముక్కుతో పొడుస్తాయి.

వీటి జీవితకాలం పదమూడేళ్లు. దక్షిణ అమెరికాలోని ఓ గ్రేట్‌ హార్న్డ్‌ ఔల్‌ యాభై ఏళ్లు బతికింది. ఇదో రికార్డు.

Updated Date - 2022-09-26T08:20:53+05:30 IST