మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-11-24T22:14:13+05:30 IST

స్విజ్‌ వాచ్‌, స్విజ్‌ చాక్లెట్స్‌, స్విజ్‌ బ్యాంకు అనేది మోస్ట్‌పాపులర్‌. ఇవన్నీ స్విట్జర్లాండ్‌ దేశానివే. ప్రపంచంలోనే హ్యాపియస్ట్‌ దేశమిది.

మీకు తెలుసా?

స్విజ్‌ వాచ్‌, స్విజ్‌ చాక్లెట్స్‌, స్విజ్‌ బ్యాంకు అనేది మోస్ట్‌పాపులర్‌. ఇవన్నీ స్విట్జర్లాండ్‌ దేశానివే. ప్రపంచంలోనే హ్యాపియస్ట్‌ దేశమిది.

ఈ దేశంలో 7000 సరస్సులున్నాయి. అన్నీ స్వచ్ఛమైనవి. వీటిలో నీళ్లు తాగొచ్చు. లేక్‌ జెనీవా దేశంలోనే పెద్ద సరస్సు.

సైన్యంలో పౌరులు చేరాలనే నిబంధన ఉండటం వల్ల ప్రతి ఇంటిలో గన్స్‌, రైఫిల్స్‌ ఉంటాయు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ప్రపంచంలోని అతి తక్కువ క్రైమ్‌ రేట్‌ ఇక్కడ ఉంటుంది. అంత కూల్‌ పర్సన్స్‌.

స్విట్జర్లాండ్‌ దేశం కంటే అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం పదిరెట్లు పెద్దది. అయితే ప్రపంచంలోనే వాచ్‌లు, టెక్నాలజీ, ఫామింగ్‌.. ఇలాంటి వాటిలో ఇన్నోవేషన్‌లో ముందు ఉండే దేశమిదే.

ఈ దేశంలో 25 శాతం విదేశాలే స్థిరపడ్డారు. ఇక్కడ జర్మన్‌ భాషను 64 శాతం మాట్లాడితే.. ఫ్రెంచి 20.4 శాతం మంది మాట్లాడుతారు. ఇటాలియన్‌ భాషతో పాటు మరికొన్ని భాషలున్నాయిక్కడ. ప్రపంచంలోనే హైయస్ట్‌ క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ ఇక్కడ ఉంది. డబ్బును అమితంగా ప్రేమించటంతో పాటు తీసుకునే న్యూట్రిన్‌ ఫుడ్‌, మెడికల్‌ పరంగా ఈ దేశీయులు అందరికంటే ముందుంటారు. నాలెడ్జిలో వీళ్లను కొట్టాలంటే కష్టం.

హైక్వాలిటీ హెల్త్‌ కేర్‌ ఉండటం వల్ల జపాన్‌ తర్వాత ఈ దేశీయులు ఎక్కువకాలం జీవిస్తారు. ఇక ఈదేశంలో 15 శాతం ఆల్ఫ్స్‌ పర్వతాల శ్రేణి ఆక్రమించి ఉంటుంది. ఆల్ఫ్స్‌ పర్వతాల మధ్య సాగే రైలు ప్రయాణం ప్రపంచంలోని అద్భుతమైన ప్రయాణాల్లో ప్రథమమని చెబుతారు.

ఈ దేశంలో 208 పర్వతాలు ఉన్నాయి.

చాక్లెట్స్‌ అంటే వీళ్లకు మహా ఇష్టం. 1,80,000 టన్నుల చాక్లెట్స్‌ను తయారు చేస్తారు. ప్రతి వొక్కరూ సంవత్సరానికి 11 కేజీల చాక్లెట్‌ తింటారిక్కడ.

రెడ్‌క్రాస్‌ సంస్థ ఇక్కడే పుట్టింది. గాటార్డ్‌ టన్నెల్‌ ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్‌ ఉంది. దీని పొడవు 57 కి.మీ.

Updated Date - 2022-11-24T22:14:16+05:30 IST