మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-11-19T22:14:48+05:30 IST

25 సెం.మీ. ఎత్తు, 75 సెం.మీ పొడవు, 25 కేజీల బరువు ఉండే ఓ చిన్న జంతువు... ఏకంగా నాలుగైదు సింహాల మీదకే వెళ్లటానికి సిద్ధం చేస్తుంది.

మీకు తెలుసా?

25 సెం.మీ. ఎత్తు, 75 సెం.మీ పొడవు, 25 కేజీల బరువు ఉండే ఓ చిన్న జంతువు... ఏకంగా నాలుగైదు సింహాల మీదకే వెళ్లటానికి సిద్ధం చేస్తుంది. సింగిల్‌గా యుద్ధం చేస్తుంది కానీ భయపడదు. దానిపేరు ‘హనీ బాడ్జర్‌’.

పొట్టిగా హైనాలా పరిగెత్తలేని శరీర నిర్మాణంతో ఉండే ఈ నల్లటి జంతువును చూస్తే చిన్న కుక్కపిల్లనో, ఎలుగుబంటో గుర్తుకు వస్తుంది. దీని శరీరంపై భాగంలో తెల్లనిజుట్టు ఉంటుంది.

హనీ బాడ్జర్‌ భూమిమీద కనపడవు. అంతరించిపోయే జాతిది. అయినా ఇవి ఎంతో అగ్రెసివ్‌. దేనికీ భయపడదు. భూమ్మీద అతి క్రూరమైన జంతువులైన సింహాలనే ఆటపట్టిస్తుంది. గట్టిగా అరుస్తూ వాటితో తలపడటమే కాదు వాటిని ఉలిక్కిపడేట్లు చేస్తుంది. సింగిల్‌గా ఉంటే చివరికి చచ్చిపోతుంది. అయినా దేనికీ భయపడదు. అలాగే చిరుతపులితో కొట్లాడతాయి. హైనా అయితే దీని దగ్గరకు రావాలంటే హడలిపోతుంది. బర్రెపై ఉండేట్లు వీటి చర్మం మందం 6.మి.మీ. ఇక ఈ జంతువు పళ్లు గట్టిగా ఉంటాయి. ఎంత అంటే.. తాబేలు చిప్పను కూడా పగలగొడుతుంది. దీని కాళ్లవేళ్లు, గోర్లు బలంగా ఉంటాయి.

వేగంగా మట్టిని తోడి.. ఆ గుంతలో పడుకుంటుంది. సోమరి జంతువు. గుహల్లో, రాళ్ల సందుల్లో ... నక్కలు, ముంగిసలు లేదా ఇతర చిన్న జంతువులు ఏర్పరచుకున్న గూటిలో వెళ్లి పడుకుంటుంది.

అనకొండలతో, ప్రమాదకరమైన పాములతో కొట్లాటకు తెగబడుతుంది. వాటిని పదునైన దంతాలతో పట్టుకుని చీల్చి వేస్తుంది. దానికి కాట్లు వేసినా విషయం ఎక్కదు. కాటు వేసినా భయపడదు. పాముల తలల్ని కొరికేస్తుంది. ఇకబోతే పోయి పోయి ముసలితో కొట్లాటను కోరితెచ్చుకుని దానిమీదకు దూకే ఈ పొట్టి జంతువు మొండిపట్టుదల చూస్తే ఆశ్చర్యమేస్తుంది.

దీన్ని చూసి ఇతర జంతువులు భయపడటానికి మరో కారణం ఉంది. ఇది ఒకరకమైన వాసన ఉండే ద్రవం స్రవిస్తుంది. ఆ వాసన కంపు భరించలేక కొట్లాట మధ్యలోనే విడిచిపెడతాయి సింహాలు.

ఫ ఇవి తెలివైనవి. వెజ్‌తో పాటు మాంసాహారం భుజిస్తుంది. ఎగ్స్‌నూ వదలదు.

ఫ తేనె అంటే విపరీతమైన ఇష్టం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. దక్షిణాఫ్రికాలో వీటి బాగోగులు చూసుకునే సెంటర్‌ ఉంది.

.....................

Updated Date - 2022-11-19T22:14:50+05:30 IST