మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-11-17T03:25:42+05:30 IST

ఆఫ్రికన్‌ జకానాకు పొడవైన కాళ్లుంటాయి. పొడవు 23 సెం.మీ. నుంచి 31 సెం.మీ. ఇకపోతే వీడి రెక్కల పొడవు 50 సెం.మీ. బరువు మాత్రం కేజీన్నర నుంచి రెండున్నర కేజీల మధ్యలో ఉంటుంది.

మీకు తెలుసా?

ఆఫ్రికన్‌ జకానాకు పొడవైన కాళ్లుంటాయి. పొడవు 23 సెం.మీ. నుంచి 31 సెం.మీ. ఇకపోతే వీడి రెక్కల పొడవు 50 సెం.మీ. బరువు మాత్రం కేజీన్నర నుంచి రెండున్నర కేజీల మధ్యలో ఉంటుంది.

నారింజ రంగు... మెడ కింద పసుపు, తెలుపు రంగు.. ముక్కుపైన లైట్‌ నీలం రంగు, తల మీద నలుపు రంగు ఉండే ఈ బహురంగుల పక్షి కేవలం నీటి కుంటల దగ్గర ఉంటుంది. సరస్సుల చెంతనే తిరగాడుతుంటుంది.

వీటిని లిల్లీ ట్రోటర్స్‌ అని ముద్దుగా పిలుస్తారు. అవి ఎప్పుడు చూసినా సరస్సుల్లోని లిల్లీ పూల మధ్య పరుగెడుతుంటాయి. అందుకే వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్స్‌ ఆ పేరుతో పిల్చుకుంటారు.

నీటిలో ఉండే పురుగులు, గింజలు, చిన్నపండ్లను తింటాయి. గేదెలు, హిప్పోల మీద నివాసం ఉండి రక్తం తాగే పురుగులను ఇవి తరచుగా తింటుంటాయి.

నైజీరియా, సెనగల్‌, మాలి, దక్షిణాఫ్రికా, సూడాన్‌, ఇథియోపియా దేశాల్లో ఇవి కనపడుతుంటాయి.

వీటి కాళ్లు పుల్లలు మాదిరి కనిపించినా బలమైనవి. నీటిలో వేగంగా ఈదగలవు. డైవ్‌ చేయగలవు.

గోధుమరంగులో ఉండే నాలుగు గుడ్లు పెడతాయివి. 26 రోజులు పొదిగే కాలం. ఆ తర్వాతనే గుడ్లులోంచి పిల్లలు బయటికొస్తాయి. కేవలం పిల్లలను 35 రోజులు మాత్రమే చూసుకుంటాయి. ఆ తర్వాత చిక్స్‌ స్వతంత్రంగా బతుక్కుంటాయి.

ఇవి గాలిలో ఎక్కువ ఎత్తులో ఎగరలేవు.

Updated Date - 2022-11-17T03:25:43+05:30 IST