ధైర్యం ప్రదర్శించిన ఆవులు!

ABN , First Publish Date - 2022-10-04T05:30:00+05:30 IST

ఒక ఊరిలో మూడు ఆవులుండేవి. అవన్నీ స్నేహితులు. అడవికి వెళ్లినా నీళ్లు తాగటానికి వెళ్లినా కలిసి వెళ్లేవి. కుంటల్లో, కొలనుల్లో ఎక్కువ సమయం గడిపేవి.

ధైర్యం ప్రదర్శించిన ఆవులు!

ఒక ఊరిలో మూడు ఆవులుండేవి. అవన్నీ స్నేహితులు. అడవికి వెళ్లినా నీళ్లు తాగటానికి వెళ్లినా కలిసి వెళ్లేవి. కుంటల్లో, కొలనుల్లో ఎక్కువ సమయం గడిపేవి. మూడింటికి దూడలున్నాయి. ఒక రోజు అడవిలో గడ్డి మేస్తున్న ఆవుల దగ్గరకు ఒక ఎలుగుబంటి పరిగెత్తుకొచ్చింది. ‘నాలుగు పులులు వస్తున్నాయి. పరిగెత్తండి’ అంటూ అరిచింది. ఆవులు పరిగెత్తపోయినపుడు క్షణాల్లో నాలుగు పులులు చుట్టుముట్టాయి. ఆవులు భయపడలేదు. పైగా కొమ్ములు రువ్వాయి. ‘ఆవులు సాధు జంతువులు అనుకున్నా. ఇవేంటీ కొమ్ములు రువ్వుతున్నాయి’ అంటూ చెట్టుమీద కోతి అరిచింది. ‘ఈ ఆవులు గతంలో సింహాలనే వెంబడించి చంపాయి’ అంటూ ఓ చిలుక చిటారుకొమ్మపైన జామపండు పొడుస్తూ గట్టిగా చెప్పింది. వీటితో కొట్లాడితే మా ప్రాణాలకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని పులులు భయపడ్డాయి. 


మూడు ఆవులూ లోపల భయంగా ఉన్నాయి. కానీ బయటికి ధైర్యాన్ని చూపించాయి. ఒక ఆవు ఇలా అంది. ‘మనం ఇంటికి వెళ్లాలి. మన పిల్లలు ఎదురు చూస్తుంటారు’ అన్నది. ఆవులు ఇంటికి బయలుదేరాయి. ఒక పులికి ఇగో దెబ్బతింది. ఒక్క ఉదుటున ఆవుమీదకు ఎగిరింది. ఆ ఆవు కొమ్ములతో ఎత్తివేసింది. కడుపు దగ్గర కొమ్ములు తగిలి పులి బిక్కచచ్చి పడిపోయింది. ఈ అడవిలో మాకంటే బలవంతులు ఆవులేమో అనుకుని పులులన్నీ వెనక్కి తగ్గాయి. 

Updated Date - 2022-10-04T05:30:00+05:30 IST