Prevent Obesity In Children: పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయానికి చెక్ పెట్టండిలా?

ABN , First Publish Date - 2022-09-27T15:57:59+05:30 IST

ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దల్లోనూ అటు పిల్లల్లోనూ ఊబకాయం సాధారణంగా కనిపిస్తున్న సమస్య.

Prevent Obesity In Children: పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయానికి చెక్ పెట్టండిలా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దల్లోనూ అటు పిల్లల్లోనూ ఊబకాయం సాధారణంగా కనిపిస్తున్న సమస్య. సరైన రోజువారి వ్యాయామం లేకపోవడం, ఆడుకునే స్థలం లేదని ఇవన్నీ ఊబకాయానికి ప్రధానకారణంగా చెప్పేసి సమాధానపడుతున్నాం. అసలు పిల్లల్లో ఈ ఊబకాయం ఎందుకు పెరుగుతుంది కారణాలలోకి వెళితే..


పిల్లల్లో ఊబకాయం సమస్య.. ఊబకాయం అనేది ప్రపంచ జనాభాలో అధిక భాగాన్ని ప్రభావితం చేస్తున్న బలమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటి. ఇది కేవలం పెద్దల్లోనే పరిమితం కాకుండా పిల్లలు కూడా ఎదిగే వయసులోనే ఊబకాయం బారిన పడుతున్నారు. 


స్థూలకాయం అనేది ఒక వ్యక్తి శరీరంపైన అధికంగా కొవ్వు పేరుకుపోయినపుడు వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయంగా పరిగణిస్తారు. ప్రపంచ ఊబకాయం అట్లాస్ 2022 ప్రకారం, భారతదేశంలో 2030 నాటికి 27 మిలియన్లకు పైగా పిల్లలు ఊబకాయంలో ఉంటారనేది ఒక అంచనా. ఇందులో ఐదు నుంచి తొమ్మిదేళ్ళ మధ్య వయస్సు గల 12 మిలియన్ల మంది ఊబకాయం ఉన్న పిల్లలు ఉంటే... 10 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల 14 మిలియన్ల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటారనేది అంచనా.


ఊబకాయం పెరుగుతున్నకొద్దీ అనేక దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంటుంది. ఇది పెద్ద ఆరోగ్య ప్రమాదాన్ని కలిగించే అవకాశాలున్నాయి.  ఇది స్ట్రోక్, గుండె జబ్బులు, మధుమేహం వంటి ఇతర సమస్యల హృదయ సంబంధ వ్యాధులను పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 


ఊబకాయాన్ని నియంత్రించేందుకు చిట్కాలు..

1. ఆరోగ్యకరమైన ఆహారం.

ఈరోజుల్లో చాలా మంది పిల్లలు చక్కెర పానీయాలు, వేయించిన ఫ్రైలు, ప్రోసెస్ చేసిన వస్తువులను తినడానికి పోషకాలతో సంబంధంలేని పదార్థాలను తినడానికే ఇష్టపడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ తీసుకునే చిరుతిళ్లను అతిగా తీసుకోవడం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది అనారోగ్య కరమైన బరువును పెంచుతుంది. అయితే ఈ విషయంలో కాస్త శ్రద్ధ అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, తృణదాన్యాలు, పప్పులు, చిక్కుళ్ళు, తీసుకోవడం ఆకుకూరలను ఎక్కువగా తినడం చాలా ముఖ్యం. ఇది శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు పెరగకుండా ఉండేందుకు ప్రాసెస్ చేసిన కొవ్వు, క్యాన్డ్, జంక్ ఫుడ్ తినడం మానుకోవడం మంచిది.


2. వ్యాయామం..

శరీరానికి వ్యాయామం అవసరం, శరీరకంగా చురుకుగా ఉండటానికి ఊబకాయం అడ్డంగా ఉంటుంది. పిల్లల రోజువారీ దినచర్యలో వ్యాయామాన్నిఅలవాటు చేయడం వల్ల అధిక కేలరీలు బర్న్ చేయడం సాధ్యమవుతుంది. దీనితో పాటు ఎముకలు, కండరాలు బలంగా మారతాయి. నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి శరీరక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేట్టు చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇది పిల్లల్లో ఊబకాయాన్ని నివారించడంలో సహాయ పడుతుంది. 


3. మంచి నిద్రకు షెడ్యూల్..

ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి నిద్ర కీలకం. బాగా నిద్రపోవడం మధుమేహాం, ఊబకాయం సమస్యలను ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. పిల్లవాడు నిద్ర లేమితో తగినంత నిద్రపోలేనప్పుడు అనారోగ్యకరమైన బరువు పెరిగే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.


4. స్క్రీన్ సమయాన్ని తగ్గించండి.

సెల్ ఫోన్ ను అదే పనిగా చూస్తూ కూర్చునే పిల్లల్లో ఎక్కువ కాంతిని చూస్తూ గంటల తరబడి కూర్చోవడం వల్ల, కళ్ళను విపరీతంగా అలిసిపోయేట్టు చేస్తుంది. కదలికలు లేక శరీరంలో బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మొబైల్ స్క్రీన్ లను చూస్తూ ఎక్కువ సమయం గడపడం పిల్లల నిద్ర అలవాట్లను ప్రభావితం చేస్తుంది. ఇది క్రమంగా బరువు పెరగడం, పేలవమైన చదువులు, మానసిక ఆరోగ్యం దెబ్బతినే సమస్యలకు దారితీస్తుంది. స్ర్కీన్ సమయాన్ని తగ్గించడం వల్ల పిల్లలు ఫేమలీ కార్యక్రమాల్లో చేయడం, ఫేమలీతో సమయాన్ని గడుపుతారు. రోజంతా చురుగ్గా ఉంటారు. 

Read more