Good Parenting: పిల్లల పెంపకంలో ఈ చిట్కాలను ఫాలో అవుతున్నారా..?

ABN , First Publish Date - 2022-11-10T11:20:49+05:30 IST

పేరెంట్స్ మానసికంగా దృఢంగా ఉండి, బాధ్యతాయుతంగా పిల్లలను పెంచడానికి ప్రయత్నించాలి

Good Parenting: పిల్లల పెంపకంలో ఈ చిట్కాలను ఫాలో అవుతున్నారా..?
Good Parenting

తల్లిదండ్రులు తమ పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వాళ్ళతో మాట్లాడుతూ ఉడటం, ప్రతి విషయాన్ని పంచుకోవడం చాలా ముఖ్యం. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వాళ్ళతో మాట్లాడటం చాలా ముఖ్యం. పిల్లలకు నచ్చినట్టుగా తల్లిదండ్రులు ఉండటం సాధ్యంకాని పని. పిల్లల దృష్టిలో తల్లిదండ్రులు ప్రతి విషయానికి తనపై అరుస్తారని, కోప్పడతారనే ఒక చెడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఈ అభిప్రాయాన్ని పోగొట్టాల్సింది తల్లిదండ్రులే.. పేరెంట్స్ మానసికంగా దృఢంగా, బాధ్యతాయుతంగా పిల్లలను పెంచడానికి ప్రయత్నించాలి.. యుక్తవయసులోకి రాబోతున్న పిల్లల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు అవసరం, మంచి పేరెంటింగ్ కోసం ప్రతి తల్లిదండ్రులు అనుసరించాల్సిన ఆరు సమర్థమైన చిట్కాలు ఇవే..

1. గోల్స్ ఏర్పరచండి.

తల్లిదండ్రులు సహజంగా తమ పిల్లలు విజయం సాధించాలని కోరుకుంటారు. వాళ్ళ కెరీర్ పరంగా రాణించాలని ఆశిస్తారు. ప్రోత్సహిస్తారు. ఇది కాస్త కఠినంగా మారితే పిల్లలు తట్టుకోలేరు. ఏ విషయమైనా పిల్లలకు సున్నితంగానే చెప్పాలి. గోల్స్ రీచ్ అయ్యేలా ప్రోత్సహించాలి. అది తల్లిదండ్రులుగా ఇద్దరి బాధ్యత.

2. కాస్త స్వతంత్రత అవసరం.

పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యత. హోంవర్క్ చేయడం, వాళ్ళ పనులను వాళ్లే చేసుకోవడం, స్నేహితులతో ఆటలు, రూమ్ సర్దుకోవడం ఇలాంటి వన్నీ పిల్లలే చేసుకునేలా చేయాలి.

3. పిల్లలకు ప్రేమ అవసరం..

మనమందరం చాలా బిజీగా రోజుని గడిపేస్తూ ఉంటాం. పిల్లల చిన్న చిన్న సరదాలు మనకు పట్టనంత బిజీ అయిపోతాం. కానీ ఇది పిల్లల్లో వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. వాళ్ళను ఒంటరితనం వైపుకు నెట్టే ప్రమాదం ఉంది. డిప్రెషన్ కు గురయ్యేలా చేస్తుంది. దీనికి ప్రతి తల్లిదండ్రులు వారితో ప్రేమాగా ప్రతి సంగతినీ పంచుకోవాలి. ప్రతి రోజూ కొత్తగా ఉండేలా చూసుకోవాలి. మనసులో మాటలను పంచుకోవడం వల్ల వాళ్ళు తేలిగ్గా ఫీల్ అవుతారు.

4. క్షమాపణ చెప్పండి.

పిల్లల విషయంలో పొరపాటు మీదని తెలిసాకా పిల్లలకు క్షమాపణలు చెప్పడం, పొరపాటు జరిగిపోయిందని ఒప్పుకోవడం చేయడం వల్ల పిల్లల మనసులు గెలుచుకుంటారు. వాళ్ళకు పొరపాటు చేసినా దిద్దుకునే స్వభావాన్ని నేర్పిన వారు అవుతారు.

5. మొరటుగా, వ్యంగ్యంగా ఉండకండి.

తల్లిదండ్రులు కూడా తమ నిగ్రహాన్ని కోల్పోవచ్చు లేదా కేకలు వేయవచ్చు. చిన్న వాటికే పిల్లలను అవమానించడం, తక్కువ చేయడం ఏదైనా వాళ్ళకు చెప్పడానికి మంచి మార్గం కాదు. పిల్లలకి ఏ విషయమైనా ప్రేమతో, శ్రద్ధతో నేర్పండి, ఏదైనా అర్థమయ్యేలా చెప్పడానికి ఇదే ఉత్తమమైన మార్గం.

6. క్రమశిక్షణ నేర్పండి.

క్రమశిక్షణ అనేది పిల్లలకు నేర్పించాల్సిన ముఖ్యమైన విషయాలలో ఒకటి. పెరుగుతున్న కొద్దీ పిల్లల క్రమశిక్షణ ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది. పెద్దలను గౌరవించడం, ప్రతి విషయంలోనూ శ్రద్ధ కలిగి ఉండటం అనేది చిన్నతనం నుంచే అలవాటు కావాలి. పిల్లలకు ఏది చెడు ఏది మంచి అనేది చిన్నతనం నుంచే తెలిసేలా చేయాలి. సరైన సమయానికి లేవడం, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం, హోమ్ వర్క్ చేసి ఆడుకోవడం వంటివి స్వతంత్రంగా చేసుకోవడం అలవాటు చేయాలి.

Updated Date - 2022-11-10T11:24:43+05:30 IST

Read more