smartphone addiction in children : పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని పోగొట్టే 7 టిప్స్..

ABN , First Publish Date - 2022-08-25T20:28:36+05:30 IST

ఓపక్క డిజిటల్ టెక్నాలజీ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతుంది. దానికి తగినట్టుగానే ప్రతి ఇంట్లోనూ రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి.

smartphone addiction in children : పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని పోగొట్టే 7 టిప్స్..

నేటి డిజిటల్ యుగంలో తల్లితండ్రులు తమ పిల్లలను స్క్రీన్ కు అలవాటు చేయడం అనేది మామూలు విషయంగా మారిపోయింది. ఓపక్క డిజిటల్ టెక్నాలజీ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతుంది. దానికి తగినట్టుగానే ప్రతి ఇంట్లోనూ రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. కరోనా సమయం నుంచి ఆన్లైన్ క్లాస్ లంటూ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకతప్పలేదు. ఇది పిల్లల మానసిక పరిస్థితి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 


టెక్నాలజికల్ ఎక్సోజర్ ఫలితంగా స్నార్ట్ ఫోన్ లు, ట్యాబ్లెట్లు పిల్లలకి పెద్దలకి అందరికీ వ్యసనంగా మారుతుంది. అయితే ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వ్యసనం పిల్లల మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, నిద్ర అలవాట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దీని నుంచి దూరం చేయడానికి కొన్ని చిట్కాలు పాటించక తప్పదు. అవేంటో చూద్దాం.


1. గమనించండి. పిల్లలు ఫోన్స్, టెబ్లెట్లతో ఎంత సమయాన్ని గడుపుతున్నారనేది పెద్దలు గమనించాలి. ఆ సమయంలో వాళ్ళు చూసే సైట్స్, మూవీస్, ఆటలు, ఎంటర్టైన్మెంట్ ఇంకా పిల్లలు ఎక్కువగా ఏది చూస్తున్నారనేది పేరెంట్స్ గమనించాలి. ఫోన్ ట్యాబ్లెట్ కి యాక్సెస్ ని పెద్దలే ఉంచుకోవాలి. రోజులో ఇంత సమయమే వారికి ఫోన్ చిక్కేలా చూడాలి.


2. ఫోన్ ఒక్కసారే లాక్కోకండి. పిల్లలు ఎక్కువగా చూస్తున్నారని గమనించినపుడు వారికి ఎక్కువ సేపు స్క్రీన్ టైమ్ తీసుకుంటే దాని దుష్ప్రభావాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి. పిల్లల నుంచి ఫోన్ దూరం పెట్టే ఆలోచన కలిగిన వెంటనే దాని సమయాన్ని తగ్గించడానికి చూడాలి తప్ప ఒకేసారి పిల్లల నుంచి ఫోన్ లాక్కోకూడదు. టైం ని తగ్గించడం గురించి వారికి అవగాహన కల్పించాలి.


3. డైలీ లిమిట్ ని సెట్ చేయాలి.  పిల్లలకు ఫోన్ విషయంగా టైం సెట్ చేయాలి అనుకున్నప్పుడు పిల్లలు మీరు పెట్టే రూల్స్ కి అంగీకరించేలా ఉండాలి.  18 నెలల వయసు కంటే తక్కువగా ఉన్న పిల్లలను స్క్రీన్ కు దూరంగా ఉంచడం మంచిది. 18-24 నెలల మధ్య వారైతే తల్లితండ్రులు కాస్త నాణ్యత ఉన్న క్వాలిటీతో వాళ్లను ఆడించవచ్చు. అదే 2-5 మధ్య వయస్సు ఉంటే కనుక వారికి రోజుకు గంటకంటే ఎక్కువ సమయం అనుమతించకూడదు. 6 సంవత్సరాల పైబడిన వారికి సరైన నిద్ర వేళలు ఉండాలి కనుక పేరెంట్స్ వీళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. స్క్రీన్ సమయాన్ని పెంచుకుంటూ పోతే వారి చిట్టి మెదళ్ళలో మనమే విషాన్ని నింపుకుపోతున్నామనే విషయాన్ని గమనించుకోవాలి. పిల్లలు చూసేవి, చూడనివి అంటూ అన్నింటినీ పేరెంట్స్ మాత్రమే ఎంచుకోవాలి. 


4. ఇంట్లో డిజిటల్ జోన్లు.. కాస్త పెద్ద పిల్లలకి చదువుల పరంగా ఫోన్ ఇవ్వక తప్పనపుడు వాళ్ళకి ఫోన్ ఇచ్చినా అది పిల్లలు పడుకునే సమయంలో వారి రూం లో ఉండకుండా చూడాలి. ఇది పిల్లల పెరుగుదలపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ వయసులో తొందరగా వాళ్లు ఫోన్ లకు అటాచ్ అయిపోతారు. చీకటి పడిన తరువాత పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ లవైపు గడపకుండా చూసుకోవాలి. 


5. వ్యాయామాన్ని, ఆటలను నేర్పించండి...పిల్లలు పరుగులెత్తుతూ ఆరుబయట ఆడుకోవడం అనేది మనకు తెలిసిన వ్యాయామం. మరిప్పటి వాళ్ళకు అలసిపోయి ఆడే ఆటలు తెలియవు.. ఫోన్ కి అంకితం చేయకుండా వాళ్లచేత ఆటలు., వ్యాయామం చేయించడం లాంటివి అలవాటు చేయించండి. అది వారిలో ఉత్తేజాన్ని నింపుతుంది. 


6. మీడియా ఫాస్ట్.. ఇది అమలు చేయాలంటే పెద్దలకు కష్టమైన విషయమే..వారంలో ఒకరోజును కేటాయించి ఆరోజు ఇంట్లో అంతా ఫోన్స్, ట్యాబ్లెట్ లను దూరంగా ఉంచేయా చేయండి. పిల్లలతో పాటు ఇంటి పని చేయండి. వాళ్ళను సాయం చేయమనండి. మొదట్లో ఇది కాస్త కష్టంగా అనిపించినా తరువాత తరువాత పిల్లలకు కూడా ఇంటి పని సరదాగా మారిపోతుంది. వాళ్లలో కొత్త పనులు నేర్చుకుంటున్నామనే ఆనందం కనిపిస్తుంది. వాళ్లు ఇంటిపనిని సరిగా చేయనపుడు కూడా విసుక్కోకుండా మెచ్చుకోండి. అప్పుడే పిల్లలు మీతో కలుస్తారు.


7. పిల్లల రోల్ మోడల్ మీరేకండి.. మీ పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించే ముందు వాళ్ళకు టైం ని సెట్ చేసే ముందు మీరు ఆ సమయాలను పాటించండి. పిల్లలు ముఖ్యంగా విన్నవాటికంటే చూసే వాటినే త్వరగా నేర్చుకుంటారు. మీరు వాడే ఫోన్ టైం ని మీకు మీరే తగ్గించుకుంటే అది పిల్లల పెరుగుదల మీద ప్రభావం చూపకుండా ఉంటుంది. వాళ్లకు మీరే ఆదర్శం కావాలి. 

Read more