క్యాటీ ఫేక్‌న్యూస్‌ కథ!

ABN , First Publish Date - 2022-09-10T05:53:35+05:30 IST

ఒక ఊరిలో గండుపిల్లి ఉండేది. దానికెప్పుడు ఇతరుల్లో టెన్షన్‌, బాధను చూడాలనే కోరిక. ఆ శాడిస్ట్‌ లక్షణాలతో తాను ఫేస్‌బుక్‌లో ఫేక్‌న్యూస్‌నును

క్యాటీ ఫేక్‌న్యూస్‌ కథ!

ఒక ఊరిలో గండుపిల్లి ఉండేది. దానికెప్పుడు ఇతరుల్లో టెన్షన్‌, బాధను చూడాలనే కోరిక. ఆ శాడిస్ట్‌ లక్షణాలతో తాను ఫేస్‌బుక్‌లో ఫేక్‌న్యూస్‌నును వైరల్‌ చేసేది. అవతలివాళ్లు బాధపడుతుంటే సంతోషించేది మనసులో. ఒకరోజు క్యాటీకి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే తన ఫేస్‌బుక్‌ ఫొటోలో పెద్ద ఎలుక ఫొటో పెట్టింది. తన వాల్‌ మీద ఇలా రాసింది. ఫలానా రావిచెట్టు దగ్గర పది బస్తాల బియ్యం వేశారని దాని సారాంశం. దాన్ని షేర్‌ కొట్టించాడు. ఆ వార్తను ఓ అల్లరి చిల్లరి ఎలుక చూసి వాళ్ల ఫ్రెండ్సుకి పంపింది. వందల ఎలుకలు ఆ రావిచెట్టు దగ్గరకి పోయాయి. ఆ బస్తాల మీద నాలుగు పిల్లులు కొట్లాడుకుంటుంటే వెనక్కి కూడా చూడకుండా ఎలుకల గుంపు పరిగెత్తిపోయింది. ఊపిరి పీల్చుకున్నాయి. ఈ వార్త విని క్యాటీ ఎంతో సంతోషపడింది. పడి పడి నవ్వుకుంది.


మరొక రోజు ఓ కవి సమ్మేళనం ఉందని ఫేస్‌బుక్‌ పోస్ట్‌ పెట్టింది క్యాటీ. దాన్ని చూసి ఇదే నిజం అనుకుని ఓ కవి ర్యాట్‌ ఎగిరి గంతేసింది. కవి సమ్మేళనం తర్వాత భోజనం కూడా పెడతామని రాసి ఉంటే ఆ యువ ఎలుక మరో కవి ఎలుకను తీసుకుని ఆ స్థలానికి వెళ్లింది. అక్కడికెళితే ఎవరూ లేరు. క్షణాల్లో రెండు గండుపిల్లులు వచ్చాయి. ఆ యువ ఎలుకలు వేగంగా చెట్టును ఎక్కాయి. ఆ చెట్టుకి జారుడుగుణం ఉండటంతో పిల్లులు ఎక్కలేకపోయాయి. యువ కవికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ఫోన్‌లో ఫలానా చెట్టు దగ్గర ప్రమాదంలో ఇద్దరు ఇరుక్కున్నారు అనే వార్తను పోస్ట్‌ చేసింది. అది కూడా కుక్కల గుంపు ఉండే గ్రూప్‌లో పోస్ట్‌ చేసింది. రెండు కుక్కలు హుటాహుటిన అక్కడికి వచ్చాయి. ఎవరూ కనిపించలేదు. ఎటూ వచ్చాం కదా అని రెండు కుక్కలు గట్టిగా మొరిగాయి. ఆ పిల్లులు పారిపోయాయి. ఎలుకలు చెట్టు దిగి ఈ విషయం కుక్కలకు చెప్పాయి. అసలు ఈ అబద్ధపు ప్రచారాన్ని ఎవరు చేశారా? అనేదాన్ని ఆ కుక్కలు పసిగట్టి చివరకు ఫేక్‌ న్యూస్‌ షేర్‌ చేసే క్యాట్‌ను పట్టుకున్నాయి. ‘తప్పయిపోయింది మహాప్రభో. ఎపుడూ చేయను’ అని కాళ్లావేళ్ల పడింది ఆ పిల్లి. ఇంకోసారి చేస్తే ప్రాణాలు దక్కవని ఆ కుక్కలు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోయాయి.

Read more