జేబీఎల్‌ ఇయర్‌ఫోన్స్‌

ABN , First Publish Date - 2022-09-10T05:43:46+05:30 IST

చేతిలో సెల్‌కు తోడు చెవిలో ఇయర్‌ఫోన్స్‌తో జనాలు కనిపించడం నేడు సర్వసాధారణం. అలాగే డిమాండ్‌కు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త

జేబీఎల్‌ ఇయర్‌ఫోన్స్‌

చేతిలో సెల్‌కు తోడు చెవిలో ఇయర్‌ఫోన్స్‌తో జనాలు కనిపించడం నేడు సర్వసాధారణం. అలాగే డిమాండ్‌కు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మొబైల్స్‌, ఇయర్‌ ఫోన్స్‌తో కంపెనీలూ అలరిస్తున్నాయి. తద్వారా తమ మార్కెట్‌ను విస్తృతపర్చుకుంటున్నాయి. ఈ పరంపరలో జేబీఎల్‌ తాజాగా ట్యూన్‌ ఫ్లెక్స్‌ ట్రూ వైర్‌లస్‌ స్టీరియో(టీడబ్ల్యుఎస్‌) ఇయర్‌ఫోన్స్‌ను ఇండియాలో విడుదల చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌ఫార్మబుల్‌ ఇయర్‌బడ్స్‌ అని చెప్పి కంపెనీ వాటిని మార్కెటింగ్‌ చేసుకుంటోంది. చెవిని తెరుచుకునే, మూసుకునే అలాగే సీల్డ్‌ ఇయర్‌ డిజైన్‌ దీని సొంతం. ఈ  ఫీచర్‌కు ‘సౌండ్‌ ఫిట్‌’ అని పేరుకూడా పెట్టింది. 12 ఎంఎం డ్రైవర్స్‌కు తోడు జేబీఎల్‌ ప్యూర్‌ బాస్‌ సౌండ్‌, సౌండ్‌ ఫిట్‌తో వచ్చింది. సింగిల్‌ చార్జ్‌తో ఎనిమిది గంటల సేపు  బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. ఆరు గంటల సేపు ప్లేటైమ్‌ కలిగి ఉంది. పది నిమిషాల చార్జింగ్‌తో రెండు గంటల సేపు ఈ ఇయర్‌ ఫోన్‌ను నడుపుకోవచ్చు. నలుపు రంగులో ఇవి లభ్యమవుతున్నాయి. ధర రూ.6,999 కాగా ఫ్లిప్‌కార్ట్‌, జేబీఎల్‌ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. 

Updated Date - 2022-09-10T05:43:46+05:30 IST