‘ఆటోజానీ’కి టైమ్‌ వచ్చిందా?

ABN , First Publish Date - 2022-09-11T09:25:10+05:30 IST

చిరంజీవి 150వ చిత్రంగా రావాల్సిన సినిమా ‘ఆటోజానీ’. పూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించాలని ప్లాన్‌ చేశారు.

‘ఆటోజానీ’కి టైమ్‌ వచ్చిందా?

చిరంజీవి 150వ చిత్రంగా రావాల్సిన సినిమా ‘ఆటోజానీ’. పూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించాలని ప్లాన్‌ చేశారు. కానీ ఎందుకో కుదర్లేదు. ఆ తరవాత ‘ఖైదీ నెం.150’ పట్టాలెక్కడం, చిరు వరుస సినిమాలతో బిజీ అయిపోవడం తెలిసిన విషయాలే. కానీ చిరుతో సినిమా చేయాలనే ప్రయత్నాన్ని పూరి ఆపలేదు. వీలైనప్పుడుల్లా.. అందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మరోసారి ఈ ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి. ‘లైగర్‌’ తరవాత పూరి నుంచి ‘జనగణమన’ రావాలి. అయితే ఆ ప్రాజెక్టు హోల్డ్‌లో పడిపోయింది. అందుకే ఈ ఖాళీ సమయాన్ని చిరు కథపై వెచ్చించనున్నాడట పూరి.‘ఆటోజానీ’ స్ర్కిప్టు ఎలాగూ సిద్ధంగా ఉంది కాబట్టి... చిరుని ఈ కథ చెప్పి, ఒప్పించి, వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని చూస్తున్నాడు పూరి. ప్రస్తుతం ‘ఆటోజానీ’ స్ర్కిప్టుకి రిపేర్లు చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రీకరణ పూర్తయింది. ‘భోళా శంకర్‌’, ‘వాల్తేరు వీరయ్య’ వరుసలో ఉన్నాయి. ఇవి రెండూ అయితే గానీ పూరి సినిమా ఓకే చేసే అవకాశం లేదు. కాకపోతే, పూరి స్పీడుగా సినిమా చేయగలడు. అరవై రోజుల్లో షూటింగ్‌ మొత్తం ఫినిష్‌ చేసే సామర్థ్యం పూరికి ఉంది. కాబట్టి చిరుకి ఏమాత్రం గ్యాప్‌ దొరికినా.. ‘ఆటోజానీ’కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

Read more