Not to Do in China: ఈసారి మీ ప్రయాణం చైనాకైతే అక్కడ ఇలా మాత్రం చేయకండేం..

ABN , First Publish Date - 2022-09-08T19:11:34+05:30 IST

విదేశాలకు వెళ్ళినపుడు అక్కడి ఆచారాలను గౌరవించడం మన బాధ్యత. చైనాలో అనేక బౌద్ధ, తావోయిస్ట్ దేవాలయాలు ఉన్నాయి. మరొక మతాన్ని విశ్వాసించి గౌరవంగా ఉండాలి.

Not to Do in China: ఈసారి మీ ప్రయాణం చైనాకైతే అక్కడ ఇలా మాత్రం చేయకండేం..

కొత్త ప్రదేశాలను చూడటం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి.. అయితే మనం ఓ దేశానికి విహారయాత్రకు వెళ్ళబోతున్నాం అంటే అక్కడి సంస్కృతి, ఆ దేశపు సాంప్రదాయాలు తెలుసుకు తీరాలి. అక్కడ ఎటువంటి ఆచారాలు ఉన్నాయి. ఏం చేయాలి. ఏది చేయకూడదు అనే విషయంపై మనకు ముందుగానే అవగాహన ఉండటం ఎంతైనా మంచిది. మన పర్యటన చైనా దేశానికి అనుకోండి. అక్కడ ఏలా ఉండాలి అనేది. చూద్దాం.


1. చైనీస్ వారితో చావు గురించి మాట్లాడకండి..

సరైన కారణం లేకుండా, సున్నితమైన రాజకీయాల గురించి చైనీస్ వారితో మాట్లాడకండి. అలాగే ఎవరైనా చనిపోయినా, చావు గురించి చైనా వారిని అడిగి మాత్రం తెలుసుకోవాలి అనుకోకండి. ఎందుకంటే చైనీస్ ప్రజలకు మరణం చాలా తీవ్రమైన, అరిష్టంగా భావిస్తారు. వాళ్ళు తెలుపు రంగు మరణాన్ని సూచిస్తుందని నమ్ముతారు. వాళ్ల దేశం వెళ్లినపుడు మాత్రం తెల్లని వస్తువులను బహుమతులుగా ఇవ్వడం గానీ, తెల్లని రిబ్బన్ తో వారిని ఇచ్చే వస్తువులను చుట్టి ఇవ్వడం కానీ చేయకండి.


2. దేవాలయాల ఆచారాలను అగౌరవపరచవద్దు.

విదేశాలకు వెళ్ళినపుడు అక్కడి ఆచారాలను గౌరవించడం మన బాధ్యత. చైనాలో అనేక బౌద్ధ, తావోయిస్ట్ దేవాలయాలు ఉన్నాయి. మరొక మతాన్ని విశ్వాసించి గౌరవంగా ఉండాలి. అక్కడ దైవాలయాలలోకి ప్రవేశించే ముందు మీ గైడ్ అనుమతి తీసుకోండి. వేలితో దేవాలయంలోని విగ్రహాలను చూపించడం, తలుపు గుమ్మం మీద కాలు వేసి తొక్కి ఎక్కడం లాంటివి అక్కడ చాలా అనాచారంగా భావిస్తారు. 


3. సన్నిహితంగా ఉండటం, హద్దులు మీరి ముద్దాడటం చేయకండి.

బహిరంగ ప్రదేశాల్లో హద్దులు మీరి ప్రవర్తించడం అక్కడ చాలా అనాగరికంగా భావిస్తారు. చైనీస్ ప్రజలు ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటారు. కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి చర్యలకు దూరంగా ఉండటం మంచిది. వారితో మాటలు కలిపే ముందు ఈ విషయాలను గురుతుంచుకోండి. వాళ్ళతో చేతులు కలిపి మాట్లాడటం కంటే నవ్వుతూ పలకరించండి. 


4. చాప్ స్టిక్ లను ఉపయోగించే ముందు ఇవి గమనించండి.

చాప్ స్టిక్ లను గిన్నె పైన ఉంచండి. వాటిని టేబుల్ మీద పడేయడం, వాటితో ఆటలాడటం, చేతుల్లోకి తీసుకుని తిప్పడం లాంటి పనులు చేయకూడదు. చైనీస్ ప్రజలకు తినే వాటికి సంబంధించి చాలా నమ్మకాలు, అభిప్రాయాలు ఉన్నాయి. తినడం పూర్తయిన తరువాత లోపల చాప్ స్టిక్ లను ఉంచడం కూడా తప్పుగా భావిస్తారు. తినడం పూర్తికాగానే తీసి పక్కన పెట్టాలి.


5. చైనీస్ భాష మీద పట్టు ఉంటే తప్ప సొంతంగా ప్రయాణించకండి.

చైనాలో కిక్కిరిసిన రైల్వే స్టేషన్ ఇంకా ఇతర ప్రదేశాలలో సొంతంగా ప్రయాణించడం అంత మంచి నిర్ణయం కాదు. చైనీస్  ప్రజలు అందరూ ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడలేరు. విమానాశ్రయం, హోటల్స్, రైల్వేస్టేష్ లాంటి రద్దీ గా ఉండే ప్రదేశాలలో తప్ప మిగిలిన చోట అప్రమత్తంగా ఉండాలి. 


ప్రాంతీయ వైరుధ్యాలు, మతపరమైన విధానాలు ఆచారాల కారణంగా రాజకీయ, మత పరమైన అంశాల గురించి చైనా వారితో మాట్లాడాలని చూడకండి. ఎందుకంటే వారు ఈ సంభాషణను ఇష్టపడరు. ఒక విధంగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వాళ్ళతో మాట్లాడేప్పుడు సున్నితమైన అంశాలకు దూరంగా ఉంచడమే మంచిది. 

Updated Date - 2022-09-08T19:11:34+05:30 IST