Craving : స్వీట్‌ తినాలనిపిస్తే?

ABN , First Publish Date - 2022-11-28T22:47:51+05:30 IST

తరచుగా స్వీట్స్‌ మీదకు మనసు మళ్లటానికి కొన్ని కారణాలుంటాయి. వాటిని తెలుసుకుని లోపాల్ని సరిదిద్దుకోగలిగితే స్వీట్లతో పెరిగే శరీర భారాన్ని అదుపు చేసుకోవచ్చు.

Craving : స్వీట్‌ తినాలనిపిస్తే?

తరచుగా స్వీట్స్‌ మీదకు మనసు మళ్లటానికి కొన్ని కారణాలుంటాయి. వాటిని తెలుసుకుని లోపాల్ని సరిదిద్దుకోగలిగితే స్వీట్లతో పెరిగే శరీర భారాన్ని అదుపు చేసుకోవచ్చు.

  • ఒత్తిడి, అలసట, నిద్రలేమి...తీపి తినాలనిపించటానికి ప్రధాన కారణాలు. శక్తి తగ్గినప్పుడు శరీరానికి తక్షణ శక్తి అందించటం కోసం తీపి మీదకు మనసు మళ్లుతుంది. ఈ ఫీలింగ్‌ రాగానే తీపి పదార్థాల కోసం వెతుక్కోకండి. ఎందుకంటే ఒకసారి తీపి తినటం మొదలుపెడితే అది అలాగే కంటిన్యూ అవుతుంది. కాబట్టి స్వీట్ల జోలికి వెళ్లకుండా మూల కారణాల్ని సరిదిద్దటం మీద మనసు పెట్టండి.

  • స్వీట్ల మీద ఇష్టం పెరగటానికి వ్యాయామం లేకపోవటం మరో కారణం. శరీరం యాక్టివ్‌గా లేనప్పుడు బద్ధకం ఆవరిస్తుంది. దాంతో మనసు కప్‌ కేక్స్‌, చాక్లెట్ల మీదకు మళ్లుతుంది. కాబట్టి ఏదో ఒక ఫిజికల్‌ యాక్టివిటీ ఉండటం తప్పనిసరి.

  • షుగర్‌ క్రేవింగ్‌కు డీహైడ్రేషన్‌ మరో కారణం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు చక్కెర పదార్థాలు తినాలనిపిస్తుంది.

  • ఈ క్రేవింగ్‌ను వదిలించాలంటే వెంటనే నీళ్లు తాగాలి.

తీపి చిట్కాలు:

  • తీపి తినాలనే కోరికను కంట్రోల్‌ చేసుకోలేకపోతే ఈ చిట్కాలు పాటించండి.

  • చాక్లెట్లు తినాలనిపిస్తే 70ు డార్క్‌ చాక్లెట్‌ రెండు ముక్కలు మాత్రమే తినండి.

  • స్వీట్‌ పొటాటో, స్వీట్‌ కార్న్‌ బెస్ట్‌ ఆప్షన్‌.

  • 2 ఖర్జూరాలు, 2 అప్రికాట్స్‌, 4 ఎండు ద్రాక్ష, 2 అంజీర్‌... వీటిలో ఏదో ఒకటి తినొచ్చు.

Updated Date - 2022-11-28T22:47:53+05:30 IST