అరికాళ్లు ఆరోగ్యంగా...

ABN , First Publish Date - 2022-12-29T00:06:54+05:30 IST

సాధ్యమైనంత వరకూ చలికాలంలో సాక్సులు వాడటం చేయటం వల్ల ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా నిద్రపోయే ముందు...

అరికాళ్లు ఆరోగ్యంగా...

  • సాధ్యమైనంత వరకూ చలికాలంలో సాక్సులు వాడటం చేయటం వల్ల ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా నిద్రపోయే ముందు అరికాళ్ల పగుళ్లున్న చోట కొబ్బరినూనెతో లేదా ఆముదంతో మర్దన చేయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

  • పెద్ద గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని ఉప్పు లేదా చేతులు, కాళ్లను శుభ్రం చేసుకునే లిక్విడ్స్‌ వేసి పదిహేను నిముషాల పాటు కాళ్లను ఉంచాలి. బేకింగ్‌ సోడాను వేసినా సరే మంచి ఫలితం ఉంటుంది.

  • ఆర్గానిక్‌ పసుపు కొమ్మను నూరి ఆ చూర్ణానికి నీటిని కలిపి పగుళ్లకు పట్టిస్తే.. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల ఉపశమనం లభిస్తుంది. లవంగం లేదా పచ్చి ఏలకుల చూర్ణాన్ని నీటితో కలిపి పట్టిస్తే చక్కని ఫలితం ఉంటుంది.

Updated Date - 2022-12-29T00:06:55+05:30 IST