-
-
Home » Navya » Health Tips » your under eye skin care guide just follow it ssd-MRGS-Navya
-
Under Eye Skin Care Guide : మీ అండర్ ఐ స్కిన్ కేర్ గైడ్..! దీనిని ఫాలోకండి చాలు.
ABN , First Publish Date - 2022-09-30T01:26:19+05:30 IST
యవ్వనంలో ప్రకాశవంతమైన ముఖంతో అందంగా కనిపించడానికి అదనపు శ్రద్ధ అవసరం.

మన శరీరంలో అత్యంత సున్నితమైన చర్మం మన కళ్ల చుట్టూ ఉంటుంది. ఇది మన ముఖంలోని మిగిలిన భాగాల కంటే తక్కువ నూనె గ్రంథులు, కొల్లాజెన్ లను కలిగి ఉంటుంది. యవ్వనంలో ప్రకాశవంతమైన ముఖంతో అందంగా కనిపించడానికి అదనపు శ్రద్ధ అవసరం. కంటి కింద చర్మ ఎంతో సున్నితంగా ఉంటుంది కనుక దీనిని ఎక్కువ కాలం పాటు కాపాడుకోవాలంటే ఈ ఐదు చిట్కాలు పాటించండి.
సరైన ఉత్పత్తులను ఎంచుకోండి.
ముఖం ఎక్కువ ట్రాన్స్ ఎపిడెర్మల్ వాటర్ లాస్ (trans epidermal water loss) ను కలిగి ఉంటుంది. దీనితో చర్మం పొడిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ మాశ్చరైజర్లు, క్రీమ్స్, చర్మ రాకన్ని బట్టి సీరమ్ లను ఎంచుకోవడం మంచిది.
సున్నితమైన స్పర్శ కోసం...
మేకప్ ప్రోడక్ట్స్ ముఖానికి రాసేముందు తీసేటప్పుడు వేళ్ళను కంటికింద రుద్దుతూ బలవంతంగా లాగకండి. అలాగే మేకప్ తీస్తున్నప్పుడు మెల్లగా రిమూవర్ తో కాటన్ ప్యాడ్ సాయంతో తీయాలి.
నిద్ర అవసరం...
తగినంత నిద్రపోవడం వల్ల నల్లటి వలయాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా కళ్ళను పదే పదే రుద్దడం కూడా అంత మంచి పనికాదు అంటున్నారు beauty specialists. తక్కువ నిద్రపోవడం వల్ల చర్మం పాలిపోయి, నల్లటి వలయాలు ఎక్కువగా కనిపిస్తాయి.
మసాజ్ మంచి మార్గం..
కళ్ళ వలయాలను పోగొట్టాలంటే మసాద్ చేయడం సరైన మార్గం. రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం..
యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, కోఎంజైమ్ క్యూ10, న్యూట్రీషియన్ లను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇది చర్మాన్ని రక్షించడంలో ముందుంటుంది.