Woman In 30s: మూడు పదులు దాటారా... ముప్పు ఉంది ముందర..

ABN , First Publish Date - 2022-08-13T21:01:16+05:30 IST

జీవితంలో ఇతర అంశాలలో వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అయినప్పటికీ, ఇక ఆరోగ్యం విషయానికి వస్తే, ఆ సంఖ్య పెరుగుతున్న కొద్దీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెస్తుందని ఎప్పుడూ కంగారు పడుతుంటారు.

Woman In 30s: మూడు పదులు దాటారా... ముప్పు ఉంది ముందర..

యవ్వనం నుంచి వయసు 30 ఏళ్లకు మారుతుందనగానే మహిళలకు చాలా ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి. పెళ్ళి, పిల్లలు, గర్భాలు, ఆపరేషన్స్ దానితో పెరిగే బరువు, రుతుచక్రంలో మార్పులు ఇవన్నీ ఆడవారికి చాలా ఒత్తిడిని తెచ్చిపెడతాయి. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం అనేది మనం దృష్టి పెట్టడానికి తగినంత సమయం ఉండకపోవచ్చు. జీవితంలో ఇతర అంశాలలో వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అయినప్పటికీ, ఇక ఆరోగ్యం విషయానికి వస్తే, ఆ సంఖ్య పెరుగుతున్న కొద్దీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెస్తుందని ఎప్పుడూ కంగారు పడుతుంటారు. సరైన అలవాట్లు లేకపోవడం, పనుల ఒత్తిడి, నెమ్మదిగా రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. 


మునుపటిలా ఆకారంలో అదే నాజూకు తనం ఉండదు, శరీరం నెమ్మదిగా పటుత్వాన్ని కోల్పోతుంది. శరీరంలో మార్పులు వస్తాయి. బరువు పెరగడం, పోషకాలు లేకపోవడం, జుట్టు రాలిపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే గర్భం దాల్చాలని చూసేవారు ఆ ప్రయత్నాలలో ఉన్నట్లయితే మరింత ఇబ్బందిని ఎదుర్కుంటారు. ఇప్పుడే రుతు చక్రంలో మార్పులను చూస్తుంటారు. డేట్స్ స్కిప్ అవడం, తరచుగా బ్లీడింగ్ సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు. పొడిబారుతున్న చర్మం, మచ్చలతో చర్మం బిగుతుగా మారిపోవడం ఇలాంటి ఆరోగ్య రుగ్మతలను చూస్తారు.  


హైబిపి: 30 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే మేజర్ హెల్త్ ప్రొబ్లెమ్స్ లలో హైబిపి ఒకటి.  సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామలోపం, ఊబకాయం, స్ట్రెస్, ఆందోళన వంటి కారణాలు. 


బ్రెస్ట్ క్యాన్సర్ : తరచుగా మహిళలు 30 ఏళ్ళు దాటిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ చెకప్ చేయించుకోవడం మంది. హార్మోనుల ప్రభావం వల్ల బ్రెస్ట్ లోపల కణుతలు ఏర్పడటం, శరీరంలో మార్పలు రావగడం జరుగుతుంది. ఇటువంటి కణుతులు అంత హానికరం కాకపోయినా, అవి క్యాన్సర్ కణాలుగా మారితే ప్రాణానికే ప్రమాదం.


ఓస్టిరియోఫోసిస్: మహిళల వయస్సు పెరిగే కొద్దిగా ఎముకలు వీక్ గా మారడంవల్ల  ప్రతి 10 మంది మహిళల్లో 5గురు ఓస్టిరియోఫోసిస్ తో బాధపడుతున్నారు.  కొత్తగా బోన్ టిష్యులకు బదులుగా పాత బోన్ టిష్యులు తీసుకోవడం వల్ల ఓస్టిరయోఫోసిస్ కు గురవుతున్నారు.


సర్వికల్ క్యాన్సర్: మహిళలు 30 నుండి 40 ఏళ్ళ మధ్య ఉన్నవారు ఈ సమస్యకు ఎక్కువ గురౌతుంటారు. అందువల్ల 30 నుండి 40ఏళ్ళ లోపు ఉన్న వారు పాప్ టెస్ట్ లేదా పెల్విక్ ఎక్సామినేషన్ చేయించుకోవడం మంచిది .


టైప్ 2 డయాబెటిస్:  30 ఏళ్ళ తర్వాత 20శాతం మంది మహిళలు టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ వల్ల ఇతర సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురికావల్సి వస్తుంది.


రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ . 30లలో ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల 60ఏళ్ళవరకూ ఆరోగ్యంగా ఉండగలరు. కాబట్టి ఇది జాయింట్ పెయిన్, ఇన్ఫ్లమేషన్, వాపు, మొదలగునవి తగ్గిస్తుంది.


తీసుకునే ఆహారం, వ్యాయామాలు మీద ప్రతేక శ్రద్ద లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా పెరగడం, హైబ్లడ్ ప్రెజర్, కార్డియో వంటి సమస్యలును ఫేస్ చేయాల్సివస్తుంది. స్త్రీలైనా, పురుషులైనా వయసు 30 వైపు పరుగులు పెడుతుందనగానే ఆరోగ్య సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. 30లలో తీసుకునే జాగ్రత్తల వల్లే ఫ్యూచర్ లో ఆరోగ్యంగా..సంతోషంగా ఉంటారు. 


Read more