brush for your hair: జుట్టు సంరక్షణకు ఏ హెయిర్ బ్రష్ ను ఎంచుకుంటారు..

ABN , First Publish Date - 2022-08-15T18:14:13+05:30 IST

సాధారణంగా మనం వాడే ప్లాస్టిక్ హెయిర్ బ్రష్ లు, దువ్వెన్నలు పలుచని పదునైన ముళ్ళతో ఉండి మన హెయిర్ కు చేటు తెస్తాయి.

brush for your hair: జుట్టు సంరక్షణకు ఏ హెయిర్ బ్రష్ ను ఎంచుకుంటారు..

ఆడవారు వాళ్ళు వాడే హెయిర్ బ్రష్ ల గురించి పెద్దగా ఆలోచించి ఉండరు. పైగా ఎలాంటి జుట్టుకు ఎలాంటి హెయిర్ బ్రష్ ను వాడాలనే విషయంగా కూడా పెద్ద అవగాహన ఉండదు. షేప్ బావుందనో, చూడటానికి, చేతిలో పట్టుకుని దువ్వేందుకు వీలుగా ఉన్నదనో చాలా వరకూ హెయిర్ బ్రష్ ను ఎంచుకుంటాం. అది మన హెయిర్ కు ఎంత వరకూ సపోర్ట్ చేస్తుందనే విషయాన్ని అసలు లక్ష్య పెట్టం. మార్కెట్ లో అనేక రకాల హెయిర్ బ్రష్ లు అందుబాటులో ఉన్నాయి. మీకు ఏది సరైనదో తెలుసుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పనే..


సాధారణంగా మనం వాడే ప్లాస్టిక్ హెయిర్ బ్రష్ లు, దువ్వెన్నలు పలుచని పదునైన ముళ్ళతో ఉండి మన హెయిర్ కు చేటు తెస్తాయి. అదే చెక్కతోనో మరో విధంగా చేసిన బ్రిస్టల్ బ్రెష్ ల వల్ల చాలా వరకూ జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా మాడుకు రక్త ప్రసరణ కూడా సవ్యంగా సాగుతుంది. అన్ని రకాల హెయిర్ బ్రష్ లు మన జుట్టుకు సరిపడవు.. ఒకవేళ మనం ఎంచుకున్న బ్రష్ మన హెయిర్ కి సరైనది కాకపోతే అది హెయిర్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మన హెయిర్ కు సరిపడే బ్రష్ ను మనమే ఎంచుకోవాలి. అంతే కాకుండా సరైన బ్రష్ లు ఎంపిక చేసుకుంటే అది నూనెను తలపై రూట్ నుంచి చివరి వరకూ సమంగా చేరేట్టు చేస్తాయి. 


1. గిరజాల, వంకర్లు తిరిగిన జుట్టుకోసం: పెద్ద పదునైన చెక్క దంతాలు ఉన్న బ్రష్.. కర్లీ, గిరజాల జుట్టు ఉన్నవారు కాస్త పెద్ద దంతాలు ఉన్న చెక్క హెయిర్ బ్రష్ ను ఎంచుకోవాలి. ఈ రకమైన బ్రష్ జుట్టుకు సరిగ్గా సరిపోతుంది. వెంట్రుకలు దీనితో దువ్వడం వల్ల ఎలాంటి బ్రేకేజ్ లు  లేకుండా ఉంటాయి. 


2. సన్నటి జుట్టు కోసం ముళ్ళ బ్రష్.. ముళ్ళ బ్రష్ తో మృదువైన జుట్టును దువ్వడంలో రాలకుండా చూస్తుంది. దీనితో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు ఇది జుట్టు ను రాలకుండా ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది. 


3. ముతక జుట్టు కోసం..nylon bristle brush..ముతక జుట్టు కోసం గట్టి నైలాన్ బ్రిస్టల్ బ్రష్ ను వాడవచ్చు. బిగుతుగా ఉన్న హెయిర్ కు సింథటిక్ పదార్థంతో చేసిన ఈ బ్రష్ వదులుగా చేస్తుంది. 


4. పొడవాటి & స్ట్రెయిట్ జుట్టు కోసం: పాడిల్ బ్రష్..

పొడవాటి లాంగ్ స్ట్రెయిట్ జుట్టుకోసం పాడిల్ బ్రష్‌లు పొడవాటి, నిటారుగా ఉండే జుట్టుపై అద్భుతంగా పని చేస్తుంది, ఎందుకంటే అవి ఒకేసారి చాలా జుట్టును దువ్వుతుంది, జుట్టు పొడవుకు సహజ నూనెను సమానంగా పంపిణీ చేస్తాయి. పైగా జుట్టు చిక్కును విడదీసేందుకు చక్కగా పని చేస్తుంది. 


5. రౌండ్ బ్రష్: పెద్ద రౌండ్ బ్రష్‌ కాస్త ఒత్తుగా ఉన్న, పొడవాటి జుట్టు కోసం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ బ్రష్‌లు ఒక రకంగా అన్ని రకాల జుట్టు తీరులను సంరక్షిస్తుంది. 


6. పాడిల్ బ్రష్:  ఫ్లాట్, వెడల్పు బ్రష్‌లు జుట్టు చిక్కులను విడదీయడానికి అలాగే జుట్టు చిట్లిపోకుండా ఉంచడానికి పనిచేస్తాయి. ఇది జుట్టు రూట్స్ ను రక్షించడంలో ముందుంటుంది.


7. వెంటెడ్ బ్రష్: ఈ బ్రష్ చిన్న జుట్టు ఉన్నవారికి బాగా పనిచేస్తుంది, తడి జుట్టును ఆరబెట్టే సమయంలో చక్కగా పని చేస్తాయి. 


8. కుషన్ బ్రష్: ఇది ప్రత్యేకంగా పొడిగా, కొద్దిగా దెబ్బతిన్న జుట్టు కోసం పనిచేస్తుంది,  పొడవాటి జుట్టును చీల్చడం లేదా విరిగిపోకుండా చూస్తుంది.


9. వైడ్ టూత్ దువ్వెన: వైడ్-టూత్ దువ్వెన దంతాలు దూరంగా ఉండే దువ్వెన., జుట్టుకు కండీషనర్, షాంపూని పెట్టేటప్పుడు జుట్టును కడగేటప్పుడు కూడా ఉపయోగపడుతుంది. జుట్టులోని చిక్కులను విప్పడానికి సులువుగా ఉంటుంది. 




Updated Date - 2022-08-15T18:14:13+05:30 IST