eat for a healthy heart : ఆరోగ్యకరమైన గుండె కోసం ఏం తినాలంటే...!

ABN , First Publish Date - 2022-09-29T19:45:28+05:30 IST

మనం ఎంచుకునే ఆహారంతో ఆరోగ్యంలో భాగంగా మన గుండెను పదిలంగా ఉంచుకునేలా చూసుకోవాలి.

eat for a healthy heart : ఆరోగ్యకరమైన గుండె కోసం ఏం తినాలంటే...!

ఆరోగ్యకరమైన గుండెకు అవసరమైన వాటిలో ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యమైనది. బలం లేని ఆహారంతో గుండెకు పెద్దగా జరిగే లాభం ఏం ఉండదు. మనం ఎంచుకునే ఆహారంతో ఆరోగ్యంలో భాగంగా మన గుండెను పదిలంగా ఉంచుకునేలా చూసుకోవాలి. సరైన ఆహారం తీసుకోకపోతే గుండెపోటు, గుండె వైఫల్యం, స్ట్రోక్స్, హైర్ టెన్షన్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చిపడతాయి. 


ఇవి తినండి...

గుండె ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలు తినడం మంచిది. వీటిలోని ఫైబర్, విటమిన్లు. ఖనిజాలు, యాంటీఆక్లిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తాయి. బరువును నియంత్రణలో ఉంచుతాయి. అలాగే మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. శరీరానికి ఖనిజం సాధారణంగా తినేదానికంటే ఎక్కువ అవసరం కాబట్టి దీనిని తీసుకోవడం చాలా ముఖ్యం. అధిక రక్తపోటు, గుండె జబ్బులను నివారించడానికి రోజుకు 1500 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువ ఉండకూడదు. ఇలా పరిమితంగా ఆహారం తీసుకోవడం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకోసం లో ఫ్యాట్ ప్రోడెక్ట్స్ ఎంచుకోవడం, కాల్చడం, వేయించడానికి బదులుగా వంటలను ఉడికించి తీసుకోవడం చాలా మంచిది. 


ఇవి చేయకండి...

జ్యూస్, ప్రాసెస్ చేసిన పండ్ల రసాలు, చిరుతిళ్ళు, పేస్ట్రీతో నింపే పండ్లలో ఎక్కువగా చక్కెర ఉంటుంది. స్త్రీలు ప్రతిరోజూ ఆరు టీస్పూన్ల కంటే ఎక్కువ చక్కెర తీసుకోకూడదు. ఇది సుమారు 100 కేలరీల వరకూ ఉంటుంది. అదే పురుషులు అయితే 150 కేలరీలు అవుతుంది.


నిజానికి మోనో ఆన్ శాచురేటెడ్ కొవ్వు, ఒమేగా -3 వంటి కొన్ని రకాల కొవ్వులు నిజానికి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆలివ్, సోయాబీన్, గింజలు, కనోలా నూనెలు, సముద్రపు ఆహారంలో ఉండే కొవ్వులు గుండెకు మంచిది. 

Updated Date - 2022-09-29T19:45:28+05:30 IST