Long time sitting : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె, ఊపిరితిత్తులకు ఏమవుతుంది.

ABN , First Publish Date - 2022-09-07T20:42:16+05:30 IST

సీటులో కొద్దిగా కూడా కదలికలు లేకపోవడం, నడకకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి వాటివల్ల శరీరానికి అధికశాతం వ్యాయామం లేకుండా పోతుంది.

Long time sitting : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె, ఊపిరితిత్తులకు ఏమవుతుంది.

రోజులో ఎక్కువ పని వేళలు పెరిగి, చాలా సమయం కూర్చుని పనిచేయడం వచ్చిన తరువాత శరీరంలో కదలికలు తగ్గి అది శరీరానికి విపరీతమైన పరిణామాలను ఇస్తుంది. సీటులో కొద్దిగా కూడా కదలికలు లేకపోవడం, నడకకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి వాటివల్ల శరీరానికి అధికశాతం వ్యాయామం లేకుండా పోతుంది. 


కానీ కాళ్ళకు వ్యాయామం అవసరం... 

శారీరక శ్రమ ఆరోగ్యాన్ని దీర్ఘాయువును ఇస్తుంది. అయితే రోజులో కొద్ది సేపు మాత్రమే నడవడం, మిగతా సమయంలో కూర్చుని ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మధుమేహం శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు. ఈ మధ్య కాలంలో కార్డియోవాస్కులర్ మరణాలు 90 శాతం పెరిగాయట. 


గుండె, రక్తనాళ వ్యాధులు, గుండె పోటు, మెదడు స్ట్రోక్స్, సిర రక్తం గడ్డకట్టడం, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ సమయం కూర్చుని పని చేసి ఎక్కువ సమయం నడవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.


ఎక్కువ సేపు కూర్చుంటే..

ఎక్కువ సమయం కూర్చుంటే ఇది బ్లడ్ గ్లూకోజ్ , బ్లడ్ ఫ్లాట్స్, బ్లడ్ ప్రెజర్ శరీర బరువు, పొత్తికడుపులోని కొవ్వును పెంచుతుంది. శరీరక శ్రమ కండరాల బలాన్ని పెంచుతుంది అదే రోజంతా కూర్చుని గడిపేవారిలో కండరాల నష్టాన్ని తీసుకువస్తుంది. అంటే కాల్షియంను తగ్గిస్తుంది. ఇది మలబద్దకాన్ని పెంచుతుంది. పెద్ద పేగు క్యాన్సర్ కు దారి తీస్తుంది. రక్తనాళాలు దెబ్బతింటాయి. నిదానమైన రక్త ప్రసరణ వల్ల రక్తం గడ్డకట్టే అవకాశాలు కూడా ఎక్కవగా ఉన్నాయి. 


గుండెపోటు, మెదడు స్ట్రోక్‌ల ప్రమాదం పెరిగిందా?

కాళ్లు, పెల్విస్ లోతైన సిరలలో రక్తం నిదానమైన ప్రవాహం వల్ల గడ్డకట్టడతుంది, ఇది స్థానభ్రంశం చెందుతుంది అలాగే ఊపిరితిత్తులకు వరకూ పోవచ్చు, దీని వలన పల్మనరీ ఎంబోలిజంలో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే యాక్టివ్, పాసివ్ లెగ్ వ్యాయామాలతో బెడ్ రెస్ట్ అవసరమయ్యే రోగులలో కూడా వ్యాయామం అవసరమని డాక్టర్స్ సూచిస్తారు. 


ఎక్కువ సేపు కూర్చోవడం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దారితీస్తుంది. ప్యాక్ చేసిన, ఆహారపదార్థాలు, పానీయాలు తీసుకోవడం చేస్తుంటాం. మొదట్లో విసుగు అనిపించినా నెమ్మదిగా వ్యసనంలా మారిపోతుంది. డెస్క్ టాప్ కంప్యూటర్ ను ఉపయోగించే వరి కంటే టెలివిజన్ చూసేవారు ఎక్కువ బరువు పెరుగుతారని తేలింది. 

Updated Date - 2022-09-07T20:42:16+05:30 IST