Surprising Uses of Banana Peels: మాంసాన్ని ఉడికించేటప్పుడు అరటి తొక్కలు ఉపయోగించండి. ఇది మాంసం రుచిని పెంచుతుంది..!

ABN , First Publish Date - 2022-09-12T16:41:11+05:30 IST

అరటిపండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి తొక్కలు నల్లగా మారినప్పుడు చక్కెర శాతం అత్యధికంగా ఉంటుంది

Surprising Uses of Banana Peels: మాంసాన్ని ఉడికించేటప్పుడు అరటి తొక్కలు ఉపయోగించండి. ఇది మాంసం రుచిని పెంచుతుంది..!

అరటిపండు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టంగా తినే పండు. దీనిలో పోషక విలువలు B విటమిన్లు, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం ఉంటాయి. కాబట్టి, ఈ పండు లోని గుజ్జు ఉన్న భాగమే కాకుండా అరటి తొక్క భాగం కూడా ఎన్నోరకాలుగా ఉపయోగపడుతుంది. అరటిపండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి తొక్కలు నల్లగా మారినప్పుడు చక్కెర శాతం అత్యధికంగా ఉంటుంది.


1.Banana Peel Tea

ఒక కప్పు అరటిపండు తొక్కలను టీ తయారుచేసుకోండి ఇది ఆరోగ్యకరమైనదేకాక చర్మంలోని లక్షణాలు డిప్రెషన్, నిద్రలేమి, ఆందోళన, అలాగే రోగనిరోధక శక్తి, జీవక్రియ పనితీరు, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శుభ్రమైన, పండిన అరటి తొక్కను రెండు కప్పుల నీటిలో 10 నిమిషాలు మరిగించాలి.


2.Eating (the peel)

అరటిపండు కన్నా అరటి తొక్కను కూడా తినవచ్చు. చిన్నతనం నుంచి అరటి పండునే తప్ప తొక్కను తినే అలవాటు లేకపోవడం వల్ల ఇది కాస్త కష్టంగానే ఉన్నా సరే తొక్కలోని ఆరోగ్యకరమైన పోషకాలు మనకు మేలు చేస్తాయి.


3. Polish

బూట్లును పాలిష్ తో కాకుండా ఇలా తొక్కతో రుద్ది పాలిష్ చేసి చూడండి. ఇది కొత్త ప్రయోగమే అయినా బూట్లకు మంచి షైన్‌ను తీసుకువస్తుంది.


4. Sun Protection

అరటి తొక్కలోని ఆల్కలీన్ కారకాలు, యాంటీ బాక్టీరియల్ UV రక్షణ అందిస్తాయి. దీనిని ముఖానికి ఫేస్ పీల్‌గా (పేస్ట్ రూపంలో) ఉపయోగించినప్పుడు, అరటిపండు చర్మంలోని ల్యూటిన్ కణాలను పునరుద్ధరిస్తుంది, మెలనిన్ స్రావాన్ని నియంత్రిస్తుంది అలాగే సూర్యరశ్మి వల్ల కలిగే పిగ్మెంటేషన్ సమస్యలకు చికిత్స చేస్తుంది.


5. Teeth Whitener

అరటిపండు చర్మంలోని మృదువైన లోపలి భాగం దంతాలను సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహకరిస్తుంది.  కొన్ని పంటి గారలను తొలగించి, తెల్లగా మెరుస్తున్నట్లు చేస్తుంది.


6. Home-made Vinegar

పులియబెట్టిన అరటిపండు తొక్కలు ప్రత్యేకమైన రుచి, తీపితో ఉంటాయి. వీటితో పుల్లని వెనిగర్‌ను తయారుచేయవచ్చు. వెనిగర్‌ను ఆహార వంటకాల్లో మాత్రమే కాకుండా క్రిమినాశక లక్షణాలను ఉపయోగించి, మీరు పాదాల దుర్వాసనను, ఫంగల్ ఇన్ఫెక్షన్ ను దూరం చేస్తుంది.


7. Meat Moisturizer

మాంసాన్ని వండే ముందు వేయించే పాన్ దిగువన పండిన అరటి తొక్కలను ఉంచి పైన మాంసాన్ని వేయండి. ఇది వైట్ మీట్ డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. అలాగే మాంసాన్ని ఉడికించేటప్పుడు అరటి తొక్కలతో కప్పి ఉంచి అరగంట తరవాత వంటకు ఉపయోగిస్తే మాంసం రుచి మారదట.


8. Compost

అరటి తొక్కలతో గార్డెన్ కి బోలెడు ప్రయోగాలున్నాయి. అరటి తొక్కలు కుళ్ళిపోతున్నప్పుడు, పొటాషియం, ఫాస్పరస్, నైట్రోజన్, మెగ్నీషియంలను మట్టిలోకి విడుదల చేస్తుంది, అదే సమయంలో తేమను కలుపుకుని... వార్మ్ పెరుగుతాయి. ఇవి మొక్కలకు మంచి పోషకాలుగా పనిచేస్తాయి. 


9. Bug Deterrent

సీతాకోకచిలుకలు కుళ్ళిన చిన్న చిన్న పురుగులు మన మొక్కలను పాడు చేస్తుంటే వాటిని ఆకర్షించడానికి అరటి తొక్కలను ఉంచితే ఫలితం ఉంటుంది.  తోట చుట్టూ పండిన అరటి తొక్కలను ఉంచండి ఇది తెగుళ్ళను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది.


10. Wart Removal

అరటి తొక్కలలో ఉండే ఎంజైమ్‌లు మొటిమలను నయం చేస్తాయి. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని తీసుకుని మొటిమలపైన కప్పి ఉంచండి. ఇది తరచుగా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.



11. Treat Puffy Eyes

అరటిపండు తొక్కలు కళ్ల కింద నల్లటి, ఉబ్బిన వలయాలకు ఉపయోగపడతాయి.  అరటిపండు తొక్కలో ఉండే తెల్లటి ఫైబర్‌ను తీసి, కలబంద జెల్‌తో కలపండి. ఈ అరటిపండు పేస్ట్‌ను రోజుకు కనీసం 30 నిమిషాల పాటు మీ కళ్ల కింద అప్లై చేయండి, ఇది మంటను తగ్గించడానికి , చర్మం రంగును సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

Updated Date - 2022-09-12T16:41:11+05:30 IST