Weight loss: చేతుల దగ్గర కొవ్వును వదిలించుకోవాలంటే...మూడు మార్గాలు..

ABN , First Publish Date - 2022-08-15T21:59:38+05:30 IST

వర్కవుట్స్ మొదలు పెట్టిన వారిలో వ్యాయామం అంటే చెప్పలేని బద్దకం, కాస్త భయం కూడా తప్పుదు.

Weight loss: చేతుల దగ్గర కొవ్వును వదిలించుకోవాలంటే...మూడు మార్గాలు..

వ్యాయామం మన ఆరోగ్యాన్ని సరైన పద్దతిలో ఉంచుతుంది. అనారోగ్యాన్ని దరిచేరనీయకుండా ఉంచడమే కాకుండా, అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది. వర్కవుట్స్ రెగ్యులర్ గా చేసే వారికంటే కాస్త గ్యాప్ తరువాత మళ్ళీ వర్కవుట్స్ మొదలు పెట్టిన వారిలో వ్యాయామం అంటే చెప్పలేని బద్దకం, కాస్త భయం కూడా తప్పుదు. బరువుగా ఉన్నవారు ఒంటి నొప్పులు వస్తాయని, కొత్తగా సమయాన్ని కేటాయించాలని ఇలా చాలా కారణాలను ముందేసుకుంటూ ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేయడం అంటే మనల్ని మనం ఫిట్ గా ఉంచుకునేందుకు సిద్ధం కావడమే. కొద్దిరోజులలోనే అధిక బరువు మన నుంచి దూరమవుతుందనే నమ్మకం. ఇందులో ఏ శరీర భాగానికి ఏ విధమైన వ్యాయామం చేయాలనే అవగాహన కూడా అవసరమే.. మామూలుగా వేసవి కాలంలో కాస్త చేతులు బిగుతుగా లేని స్లీవ్ లెస్ టాప్స్ వేద్దామనుకుంటే చేతులు లావుగా కనిపిస్తాయనే సందేహంతో అలా చేయలేం.. చేతులు దగ్గర పేరుకున్న కొవ్వును ఈ ఎక్సర్ సైజ్ ద్వారా తగ్గించుకోవచ్చు అదెలాగో చూద్దాం.


చేతుల దగ్గర ఉబ్బెత్తుగా ఉండటం అనేది అసౌకర్యంగా అనిపిస్తుంది, చేతి దగ్గర అదనపు కొవ్వును వదిలించుకోవడానికి ఏకైక మార్గం స్థిరమైన వ్యాయామం చేయడమే. దానికోసం ముందుగా రెండు లీటర్ల వాటర్ ను తీసుకోండి. కాస్త కొద్దిగా బరువు ఉన్న వెయిట్స్ ను ఎత్తడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవడంతో మీ వర్కవుట్ ప్రారంభం అవుతుంది. 1. బైసెప్స్ కర్ల్ ( Biceps Curl ).. 

1.  పాదాలను హిప్-వెడల్పుగా ఉంచి నేలపై నిలబడాలి.  చేతులను ఒక్కో చేతిలో డంబెల్స్‌తో సాగదీయాలి.

2. పైభాగాన్ని స్థిరంగా ఉంచుతూ,  కండరాలను బిగిస్తూ, భుజం స్థాయికి తీసుకురావడానికి బరువులను వంకరగా ఉంచాలి.

3. మోచేతులు కదలకుండా బరువులను వీలైనంత ఎక్కువగా తీసుకురావాలి.

4. ఈ స్థితిలో 2-3 సెకన్లపాటు ఉంచి, ఆపై నెమ్మదిగా బరువు తగ్గించాలి. అదే 10-15 సార్లు రిపీట్ చేయండి.


2. పుష్అప్ (Modified Push-Up)..

1.  మోకాళ్లను నేలపై, నేరుగా భుజం కింద ఉంచి, పుష్-అప్ పొజిషన్‌లోకి రావాలి. పాదాలు నేల నుండి దూరంగా ఉండాలి.

2. తిరిగి ప్రారంభ స్థానానికి వెళ్లి, అదే రిపీట్ చేయాలి.


3. ట్రైసెప్స్ డిప్ (Triceps Dip)..

1. సోఫా లేదా కుర్చీ వైపు వెనుకభాగంలో నిలబడి,  చేతులను పై అంచున భుజం-వెడల్పు వేరుగా ఉంచండి. భుజాలు, మణికట్టుకు లంబంగా ఉండాలి.

2.ఇప్పుడు నేలపై మడమలతో కాళ్ళను ముందుకు చాచండి.

3. మోచేయిని నెమ్మదిగా వంచి, మోచేయి 90-డిగ్రీల కోణం వచ్చే వరకు నియంత్రిత పద్ధతిలో తుంటిని నేల వైపుకు ఉంచాలి.

4. ఈ స్థితిలో 2-3 సెకన్లపాటు ఉంచి, ఆపై సాధారణ స్థితికి రావడానికి పైకి కదలండి. 10-15 సార్లు అదే విధంగా రిపీట్ చేయండి.


ఇవన్నీ సాధారణంగా మన మోచేయి పై భాగం నుంచి పేరుకున్న అధిక కొవ్వును కరిగిస్తాయి. మొత్తం శరీరం కదలికలతోనే అధిక బరువును వదిలించుకోవడం సాధ్యం అవుతుంది. కేవలం వర్కవుట్స్ మాత్రమే కాకుండా రోజూ తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. 

1. వాటర్ తగిన మోతాదులో తీసుకోండి.

2. పగటిపూట ఆకుపచ్చ కూరగాయలు, గింజలు, గింజలు పండ్లు సూక్ష్మపోషకాలు ఉన్నవాటిని తీసుకోవాలి.

3. విటమిన్ B12, విటమిన్ C, విటమిన్ D లోపించిన వారు వీటిని తీసుకోవడం చాలా ముఖ్యం.

4.  తగినంత నిద్ర లేకపోవడం ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలకు దారితీస్తాయి.

5. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. అధిక బరువును కంట్రోల్ లో ఉంచుకునే ఈ పద్దతులను పాటించడం ద్వారా శరీరంలో పేరుకునే కొవ్వు శాతాన్ని తగ్గించుకోవచ్చు. 

Read more