cinnamon: మధుమేహ వ్యాధిగ్రస్తులు దాల్చినచెక్కను తీసుకుంటే... కలిగే ప్రయోజనాలు..!

ABN , First Publish Date - 2022-09-22T16:21:41+05:30 IST

ఇది మన భారతీయ వంటశాలలలో ఉపయోగించే సాంప్రదాయ గరం మసాలా తయారీలో ఒక ముఖ్యమైన పదార్ధం.

cinnamon: మధుమేహ వ్యాధిగ్రస్తులు దాల్చినచెక్కను తీసుకుంటే... కలిగే ప్రయోజనాలు..!

దాల్చినచెక్కను రుచి కి మన వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాము. ఇది మన భారతీయ వంటశాలలలో ఉపయోగించే సాంప్రదాయ గరం మసాలా తయారీలో ఒక ముఖ్యమైన పదార్ధం. దాల్చినచెక్కను రుచి కోసం మన ఆహారంలోతీసుకుంటున్నప్పటికీ, ఇది ఇంకా అనేక ఇతర ప్రయోజనాలను కూడా ఇస్తుంది. మన వంటలలో రారాణిగా ఉంటూ వస్తున్న దాల్చిన చెక్క గురించిన ఆసక్తిరక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


మధుమేహంతో ఉన్నవారు దాల్చినచెక్క తీసుకుంటే..


1. మధుమేహం అనేది ఎక్కువ ఏటియాలజీలతో పోరాడాల్సి ఉంటుంది. దాల్చినచెక్కలో ఉండే 'సహజ ఇన్సులిన్ సెన్సిటైజర్'. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. 


2. అదనంగా, టైప్ II డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిపై చేసిన అనేక అధ్యయనాలలో, దాల్చినచెక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అలాగే HOMA-IR స్థాయిలను తగ్గించడంలో ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు తెలిపారు.


3. మధుమేహ వ్యతిరేక ప్రభావం: దాల్చినచెక్కలో క్రియాశీలక సమ్మేళనాల్లో (active compounds) సమృద్ధిగా ఉంటుంది.  చాలా రకాల క్లినికల్ అధ్యయనాలు ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందని కూడా  సూచించాయి, అందుచేత రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో కూడా ఉంచుతుంది. 


4. దాల్చినచెక్కలోని ఫోటోకెమికల్, ఫినాలిక్, క్రోమియం వంటివి ప్రధానంగా దాని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-డయాబెటిక్, యాంటీ-ట్యూమర్, యాంటీకాన్సర్, యాంటీ-హైపర్గ్లైసీమిక్ ఎఫెక్ట్‌లకు కారణమవుతాయి.


దాల్చిన చెక్క టీ.. 

*ఒక గ్లాసు నీళ్లు తీసుకుని మరిగించాలి.

* నీటిలో అర టీస్పూన్ లేదా 2-3 చిటికెల దాల్చిన చెక్క పొడి వేసి 2-5 నిమిషాలు మరగనివ్వండి.

* నీరు ఎర్రగా-గోధుమ రంగులోకి మారిన తర్వాత, మంటను ఆపివేయండి. కొద్దిగా చల్లార్చి ఈ టీని రుచి చూడండి.


ఏ సమయంలో తీసుకోవాలి...

ఉదయం ఫ్రెష్ అప్ అయ్యాక లేదా అల్పాహారంతీసుకున్న తరువాతగానీ తీసుకోవచ్చు. లేదంటే రాత్రి భోజనానికి 15 నిమిషాల ముందుగానీ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. 

Updated Date - 2022-09-22T16:21:41+05:30 IST