Surprising Uses For : కాలిన గాయాలకు చెక్ పెట్టే Vicks తో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు..!

ABN , First Publish Date - 2022-09-28T15:32:52+05:30 IST

ఆల్ రౌండర్ మెంథాల్ లేపనం సాధారణంగా జలుబు లక్షణాలనుంచి ఉపసమనాన్ని ఇస్తుంది.

Surprising Uses For : కాలిన గాయాలకు చెక్ పెట్టే Vicks తో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు..!

ఈ ఆల్ రౌండర్ మెంథాల్ లేపనం సాధారణంగా జలుబు లక్షణాలనుంచి ఉపసమనాన్ని ఇస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని తేమగా మార్చడానికి ఇంకా కొన్ని ఇతర పనులకు కూడా ఉపయోగపడుతుంది. విక్స్ ను బాగా జలుబు చేసినపుడు, ముక్కు దిబ్బడగా ఉన్నప్పుడు మాత్రమే వాడతాం. అయితే దీనితో మరిన్ని ప్రయోజనాలున్నాయట.


మ్యాజిక్ క్యూర్ గురించి ఎప్పుడైనా విన్నారా?  అదేంటంటే..


1. చెవి నొప్పులను దూరం చేస్తుంది.

తరచుగా చెవి నొప్పితో బాధపడుతుంటే కనుక ఈనొప్పి తగ్గడానికి vaporup తో తగ్గించవచ్చు. కొద్దిగా దూది తీసుకుని దానికి విక్స్ రుద్ది, దానిని సున్నితంగా చెవిలో పెట్టుకోండి. నెమ్మదిగా చెవి నొప్పి తగ్గుతుంది.


2. కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది.

పెద్దవారిలో సాధారణంగా కనిపించే కీళ్ళ నొప్పులకు విక్స్ మంచి ఉపసమనంగా పనిచేస్తుంది. ఇది తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది. నొప్పి రోజులు, వారాలుగా ఉంటున్నట్లయితే వైద్యుడిని సంప్రదించడం తప్పని సరి.


3.  ఐ మేకప్ ను తుడవండి.

కంటి అలంకరణలో వాటర్ ఫ్రూఫ్ మస్కరా వేసినపుడు స్టాండర్డ్ వైప్ పని చేయదు. అలాంటప్పుడు కాటన్ ప్యాడ్ పైన విక్స్ వేసి కంటికి తాకకుండా మేకప్ ను సున్నితంగా తుడవండి.


4. అరోమాథెరపీకి వాడి చూడండి.

కొన్నిసార్లు రూంలో విశ్రాంతి కి అరోమాథెరపీ మంచి అలవాటు. ఇది మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. దీనిని విక్స్ మెంథాల్ తో వేసినట్లయితే ఆ సువాసన మంచి రిలాక్స్ ని ఇస్తుంది. కాబట్టి ఇంట్లో ఇది ట్రైచేసి చూడండి.


5. చర్మం దురదకలిగిస్తుంటే..

చర్మం ఒక్కోసారి దురద పుడుతుంది. ఈ పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారేలోపు ఆ అసౌకర్యం నుంచి బయటపడాలంటే విక్స్ రాసి చూడండి. చర్మ మీద పడిన గీతలను కూడా తగ్గించడంలో విక్స్ సహకరిస్తుంది. 


6. కాళ్ళల్లో వచ్చే చీలికలను సరిచేయండి.

కాళ్ళు పగుళ్ళకు విక్స్ చక్కగా పనిచేస్తుంది. వానాకాలంలో, శీతాకాలంలో కాలి పాదాలు పగలడం మామూలే దీనికి విక్స్ పూత మేలు చేస్తుంది.

 

7. కాలిన గాయాలకు విక్స్ తో ఉపశమనం..

వంట చేసేప్పుడు చేతులు కాలడం అనేది సాధారణంగా జరిగేదే దీనికి చక్కని ఉపశమనంగా విక్స్ పనిచేస్తుంది. కాలిన గాయాల నుంచి నొప్పిని తగ్గిస్తుంది. రోజుకు రెండుసార్లు పూతగా పూయాలి. 

Updated Date - 2022-09-28T15:32:52+05:30 IST