Suffer from..! తరచుగా అలర్జీల బారిన పడుతున్నారా? అయితే వీటి జోలికి పోకండి మరి..!

ABN , First Publish Date - 2022-09-25T01:55:15+05:30 IST

అప్పుడప్పుడు మనం తీసుకునే పచ్చి పండ్లు, కూరగాయలు తీసుకున్న తరువాత అలెర్జీలా కనిపిస్తాయి. జ్వరం లాంటి లక్షణాలు కనిపించినట్లయితే ఇది ఓరల్ అలెర్జీ సిండ్లోమ్ అని గుర్తించాలి.

Suffer from..! తరచుగా అలర్జీల బారిన పడుతున్నారా? అయితే వీటి జోలికి పోకండి మరి..!

మామూలుగా మనం తీసుకునే రోజువారి ఆహారంలో కాస్త మార్చినా ఒక్కోసారి శరీరంలో పెద్దగా మార్పు కనిపించదు కానీ శరీరానికి పడని పదార్థాలు తిన్నప్పుడు మాత్రం అనారోగ్య బారిన పడతాం. అప్పుడప్పుడు మనం తీసుకునే పచ్చి పండ్లు, కూరగాయలు తీసుకున్న తరువాత అలెర్జీలా కనిపిస్తాయి. జ్వరం లాంటి లక్షణాలు కనిపించినట్లయితే ఇది ఓరల్ అలెర్జీ సిండ్లోమ్ అని గుర్తించాలి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ అలర్జీ, ఆస్తమా, ఇమ్యూనాలజీ ఈ అలెర్జీలు సాధారణంగా చిన్నపిల్లల్లో కనిపిస్తాయని కనుగొంది.

 

అలర్జీ సమస్య మొక్కల పుప్పొడి ద్వారా వస్తుంది. ఈ రకమైన అలెర్జీకి గొంతు దురద, నాలుక, లేదా నోటి లోపల జలదరింపు అనుభూతి కలుగుతుంది. ఉబ్బిన తిమ్మిరి పెదవులు, ముక్కు దిబ్బడ, తుమ్ములు, చెవులు దురద, దద్దుర్లు కూడా కొందరిలో కనిపించే లక్షణాలు.

 

1.    1.  పచ్చి పళ్ళు కూరగాయలు బాగా కడిగి మాత్రమే తీసుకోవాలి.

2.        

2. పండ్లు, కూరగాయలు బాగా కడిగే అలవాటు చేసుకోవాలి.


3. మనం తీసుకునే పండ్లకు peels ( తొక్కలు ) తీసి తినడం వల్ల అలర్జీలను దూరం పెట్టినట్టే..

 

4. చాలా అలెర్జీ కారకాలు ప్రోటీన్లు.. అందువల్ల, సీఫుడ్, విలువైన ఆహారాలలో ఒకటి అయినప్పటికీ, వీటిలో  ట్రేస్ ఎలిమెంట్స్, విటమిన్లు సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటుంది. కాకపోతే అలర్జీ ఉన్నవారు సీఫుడ్ తీసుకుంటే తిరిగి అలెర్జీ పెరిగే అవకాశం ఉంటుంది.

5. బయట దొరికే చికెన్ కొన్ని బ్రాండ్లలలో దొరికే చికెన్ లో ప్రమాదకరమైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఇవి అలర్జీ ఉన్నవారు తీసుకోవడం వల్ల సమస్య మరింత పెద్దది కావచ్చు.

 

6. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా తీసుకోవడం మూలంగా, అలర్జీలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలలో తేలింది. ఈ కొవ్వు ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం మూలాన అలర్జీ లక్షణాలను తగ్గుతాయి.

 

7. రోస్మారినిక్ ఆమ్లం: అలెర్జీ ప్రతిచర్యలను అణచివేయడంలో రోస్మారినిక్ ఆమ్లం సహకరిస్తుంది. ఇందులోని ఇమ్యూనోగ్లోబ్యులిన్, ల్యూకోసైట్ల ద్వారా కలిగే వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రోస్మారినిక్ ఆమ్లం ఒరేగానో, లెమన్ బాం, రోజ్మేరీ, సేజ్, పుదీనా, వాము వంటి మూలికలలో ఉంటుంది.

 

 8. క్వెర్సెటిన్ ఉన్న ఆహారాలు : బయోఫ్లేవొనోయిడ్ క్వెర్సెటిన్ అనేది ఒక ముఖ్యమైన అలర్జీ వ్యతిరేక పోషకంగా చెపుతారు. ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హిస్టమైన్ గుణాలు ఉన్నట్లుగా పరిశోధనలలో చెపుతున్నాయి. ఈ గుణాలు అలెర్జీ లక్షణాల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. క్వెర్సెటిన్ ఎరుపు, పసుపు ఉల్లిపాయలు, ఆపిల్, రాస్బెర్రీస్, చెర్రీలు, క్రాన్బెర్రీస్, బ్రోకోలీ, ఎరుపు రంగు ద్రాక్ష, సిట్రస్ పండ్లు, రెడ్ వైన్ , టీ లో ఉన్నాయి.

 

 9. విటమిన్ సి ఆహార పదార్ధాలు : విటమిన్ ‘ C ‘ అనేది వాపు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది అలర్జీలతో బాధపడుతున్న వారిలో రోగ లక్షణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరంలో హిస్టామిన్ విడుదలను తగ్గించడం, హిస్టమైన్ ను వేగంగా విచ్ఛిన్నం చేయడం మొదలైన వాటిలో విటమిన్ సి కీలకపాత్ర పోషిస్తుంది. హిస్టామిన్ అనేక అలెర్జీలకు కారణం అవుతుంది.

 

10. సెలీనియం ఉండేలా చూసుకోండి : అలర్జీలను తగ్గించడంలో సెలీనియం ప్రభావవంతంగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే ప్రత్యేక ప్రోటీనులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. ఇది పుట్టగొడుగులు, కాడ్, వంటి వాటిలో సెలీనియం అధికంగా ఉంటుంది. సెలీనియం ఉండే ఆహారాలను తరచుగా తీసుకోవడం మూలంగా అలర్జీలు రాకుండా ఉంటాయి.

Read more