-
-
Home » Navya » Health Tips » Start your morning with these five foods ssd-MRGS-Navya
-
Top 5 foods to start your day with: మీ ఉదయాన్ని ఈ ఐదు ఆహార పదార్థాలతో ప్రారంభించండి.
ABN , First Publish Date - 2022-09-09T14:49:27+05:30 IST
ఉదయాన్నే తీసుకునే అల్పాహార విషయంలో మంచి పోషకాలు ఉండే పదార్థాలను తీసుకోవడంవల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

మనం తీసుకునే ఆహారం పై శ్రద్ధ చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బావుండి, రోగాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉదయాన్నే తీసుకునే అల్పాహార విషయంలో మంచి పోషకాలు ఉండే పదార్థాలను తీసుకోవడంవల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు.
పాలు తీసుకుంటున్నారా?
పాలను ప్రతి రోజూ అల్పాహారంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనికి అరటి పండును కలిపి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బాదం మరిచిపోకండి.
బాదం పప్పును రాత్రి నీళ్ళల్లో వేసి ఉదయాన్నే పొట్టు తీయకుండా తినేయండి. ఇందులోని ప్రోటీన్, విటమిన్స్, ఓమేగా3 ఫ్యాంటీ యాసిడ్స్ అనారోగ్య సమస్యలను దరిచేరనీయవు.
ఓట్ మిల్ కూడా మేలే..
మనలో అందరికీ కాదుకానీ కొందరికి ఓట్స్ రోజువారి ఆహారంలో భాగమే. పండ్లతో పాటు ఓట్ మిల్ కలిపి తీసుకుంటే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇందులోని ఫోలేట్, పొటాషియం ఆరోగ్యాన్ని పెంచుతాయి.
రోజూ గుడ్డు తిసుకోండి.
ప్రతి రోజూ గుడ్డును ఆహారంలో తీసుకోవడం వల్ల ఇందులోని ప్రోటీన్స్, పోషక పదార్ధాలు మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
ఖాళీ కడుపుతో ఇవి మాత్రం తీసుకోకండేం..
ఖాళీ కడుపుతో పంచదారను తీసుకోకూడదు. అలాగే మజ్జిగను కూడా ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. వీటితో పాటు నారింజ, నిమ్మకాయ రసం, ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఇవి ఎసిడిటీని పెంచుతాయి.