గర్భిణి బొప్పాయి తినకూడదు?

ABN , First Publish Date - 2022-09-06T15:29:53+05:30 IST

బొప్పాయిలో విటమిన్‌ ఎ పుష్కలంగా ఉండే మాట నిజమే అయినా, విటమిన్‌ ఎ విపరీతంగా తీసుకుంటే అబార్షన్‌

గర్భిణి బొప్పాయి తినకూడదు?

అపోహ: గర్భిణులు బొప్పాయి తింటే అబార్షన్‌ అవుతుంది?

వాస్తవం: బొప్పాయిలో విటమిన్‌ ఎ పుష్కలంగా ఉండే మాట నిజమే అయినా, విటమిన్‌ ఎ విపరీతంగా తీసుకుంటే అబార్షన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే గర్భ విచ్ఛిత్తి జరిగేటంత విటమిన్‌ ఎ అందాలంటే కనీసం 5 కిలోల బొప్పాయి తినాలి. ఇంతమేర గర్భిణులు తినలేరు కాబట్టి బొప్పాయి తినటం వల్ల అబార్షన్‌ జరుగుతుందని అనుకోవటం పొరపాటు. మిగతా పండ్ల మాదిరిగానే, బొప్పాయిని పరిమితంగా తీసుకోవటం వల్ల ప్రమాదం ఉండదు.

Updated Date - 2022-09-06T15:29:53+05:30 IST