-
-
Home » Navya » Health Tips » If you know how many liters of urine a man spits in his lifetime ssd-MRGS-Navya
-
మనిషి తన జీవిత కాలంలో ఎన్ని లీటర్ల ఉమ్ము వేస్తాడో తెలిస్తే..!
ABN , First Publish Date - 2022-07-19T17:20:39+05:30 IST
మనకన్నా బిజీ బిజీగా మన శరీరంలోని అవయవాలన్నీ పనిచేస్తాయని ఎప్పుడన్నా ఆలోచించామా? ఆలోచనకు అందని వింతలు ఎన్ని మన దేహంలో జరుగుతున్నాయో తెలుసుకున్నామా?

ఉదయాన్నే హఢావుడిగా లేవడం కాలకృత్యాలు తీర్చుకుని పనుల్లోకి పరుగులెత్తడం, ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేకపోతే డాక్టర్స్ చుట్టూ తిరిగి తగ్గిపోయాకా మళ్ళీ అదే ఆదరా బాదరా జీవితాన్ని గడిపేస్తున్నాం. కానీ మనకన్నా బిజీ బిజీగా మన శరీరంలోని అవయవాలన్నీ పనిచేస్తాయని ఎప్పుడన్నా ఆలోచించామా? ఆలోచనకు అందని వింతలు ఎన్ని మన దేహంలో జరుగుతున్నాయో తెలుసుకున్నామా? మన శరీరంలో జరిగే ప్రతి చర్యా మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు అవేంటనేది తెలుసుకుందాం.
1. మనిషికి నిద్ర చాలా అవసరం. అది మనసుకు ప్రశాంతతను, విశ్రాంతిని ఇస్తుంది. కానీ.. ఇలా గాఢ నిద్రలో ఉన్నప్పడు మనిషి మెదడు చురుగ్గా పనిచేస్తుందట. ఈ గాఢ నిద్ర వల్లే 90 శాతం కలలు తెల్లవారేసరికి మనకి గుర్తుండవు.
2. మన బ్రెయిన్ స్టోరేజ్ కెపాసిటీ ఒక మిలియన్ జిగా బైట్స్ వరకు ఉంటుంది.
3. శరీరంలో ఓ వయసు వచ్చాకా పెరుగుదల ఆగిపోయే అవయవం చెవులు. ఇవి ఎప్పటికీ పెరగవు!
4. సగటున ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో టాయిలెట్ లో గడిపే సమయం ఒక సంవత్సరం ఉంటుందట.
5. మన ఊపిరితిత్తుల సర్‌ఫేస్ ఏరియా సుమారు 50 నుంచి 75 స్క్వేర్ మీటర్లు. అంటే ఒక టెన్నీస్ కోర్టు అంత ఉంటుంది.
6. మానవ మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు 268 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి.
7. శిశువు గర్భంలో ఉన్నప్పుడే పిండం ఆరు నెలల వయసు నుంచే హస్తరేఖలతో పాటు ఫింగర్ ప్రింట్స్ కూడా ఏర్పడతాయి.
8. మీకు తెలుసా మనం మన జీవితకాలంలో సుమారు 40,000 లీటర్ల ఉమ్మిని ఉత్పత్తి చేస్తాం.
9. మనిషి శరీరంలో ఒక సెకనుకు 300 మిలియన్ల కణాలు చనిపోతూ.. మరో 300 మిలినయన్ల కొత్త కణాలు పుడుతూ ఉంటాయి.
10. మనిషి ఊపిరి పీల్చుకోవడం, మింగడం ఈ రెండు పనులని ఒకేసారి చేయలేరు. కానీ.. పసిపిల్లలు ఈ రెండు పనులని ఒకేసారి సునాయాసంగా చేయగలరు.
11. సగటున ముక్కు ప్రతిరోజూ ఒక కప్పు నాసికా శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది!
12. మీరు పడుకునే సమయం కంటే ఉదయాన్నే లేచినప్పుడు 1సెం.మీ పొడవుగా ఉంటారు.
13. మానవ శరీరం అంతటా నిరంతరం రక్తంప్రసారం జరుగుతూ ఉంటుంది. కానీ.. బాడీలో రక్తప్రసారం లేని ఏకైక భాగం కంటిలోని కార్నియా. ఇది గాలి నుంచే నేరుగా ఆక్సిజన్ ని గ్రహిస్తుందట.