హార్మోన్లు సమతులంగా...

ABN , First Publish Date - 2022-11-21T22:34:18+05:30 IST

శరీరంలోని ఆరోగ్య వ్యవస్థల పనితీరు మొత్తం హార్మోన్ల సంతులనం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి హార్మోన్లను సంతులనంగా ఉంచే ఆహారాన్ని ఎంచుకోవాలి.

హార్మోన్లు సమతులంగా...

శరీరంలోని ఆరోగ్య వ్యవస్థల పనితీరు మొత్తం హార్మోన్ల సంతులనం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి హార్మోన్లను సంతులనంగా ఉంచే ఆహారాన్ని ఎంచుకోవాలి.

క్రూసిఫెరస్‌ కూరగాయలు: కాలిఫ్లవర్‌, బ్రొకొలి లాంటి క్రూసిఫెరస్‌ జాతికి చెందిన కూరగాయలను రోజుకో కప్పు చొప్పున ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

అవిసె గింజలు: ఒక టేబుల్‌స్పూను అవిసె గింజల పొడిని స్మూదీలలో, సలాడ్లు, పెరుగులో కలిపి తీసుకోవాలి.

చేదు: కేల్‌, డాండీలియన్‌, కాకరకాయ కూర, లేదా వేపుడు.. ప్రతి భోజనంలో ఒక టేబుల్‌స్పూను ఉండేలా చూసుకోవాలి.

గుడ్లు: ఉదయం అల్పాహారంలో భాగంగా గుడ్లను ఎంచుకోవాలి.

కొబ్బరినూనె: కాఫీలో లేదా వంటకాల్లో కొబ్బరినూనె వాడుకోవాలి.

చేపలు: కొవ్వుతో కూడిన చేపలు వారంలో కనీసం రెండు సార్లైనా తీసుకోవాలి.

Updated Date - 2022-11-21T22:34:20+05:30 IST