Healthy Heart Diet : గుండెకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయాలంటే ఇలా చేయండి.

ABN , First Publish Date - 2022-09-08T19:02:57+05:30 IST

కురగాయలు, పండ్లు, గుండె ఆరోగ్యాన్ని పెంచే పైబర్, విటమిన్లు., మినరల్స్., యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి.

Healthy Heart Diet : గుండెకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయాలంటే ఇలా చేయండి.

ఆరోగ్యకరమైన గుండె కోసం ఇలా చేయండి. కురగాయలు, పండ్లు, గుండె ఆరోగ్యాన్ని పెంచే పైబర్, విటమిన్లు., మినరల్స్., యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.


జ్యూస్, ప్రాసెస్ చేసిన వాటిని ఎక్కువగా తీసుకోకండి.

జ్యూస్, ప్రాసెస్ చేసిన పండ్లు, స్నాక్స్ అతిగా తీసుకోవద్దు. అల్పాహారంగా తీసుకునే వాటిలో ఎక్కువగా చక్కెర స్థాయిలు ఉంటాయి. మొత్తం 100% పండ్ల రసాలు ఆరోగ్యకరమైన ఫలితాలనే ఇస్తాయి. అయితే ఇవి ప్యాకెట్స్ రూపంలో ఉండటం వల్ల వాటిలోని ఆరోగ్యకరమైన కేలరీలు పోతాయి. అప్పటికప్పుడు తీసిన పండ్ల రసాలనే తీసుకోవడం గుండెకు మేలు చేస్తుంది.


సోడియాన్ని తగ్గించండి.

మన శరీరంలో సాధారణంగా తినే వాటికంటే తక్కువ పరిమాణంలో ఖనిజం అవసరమవుతుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బల నుంచి ఉపశమనానికి సోడియం 1,500 మిల్లీగ్రాములు సరిపోతుంది. సోడియం ప్రోసెస్ చేసిన పదార్థాలతో శరీరానికి అందదు. 


చక్కెర గురించి...

చక్కెర ఆరోగ్యకరమైన ఆహారం కాదు. ఇది శక్తిని అందిస్తుంది కానీ పోషకాహారం మాత్రం కాదు. రోజుకు ఆరు టీ స్పూన్ల కంటే ఎక్కువ చెక్కెరను తీసుకుంటే వారిలో కొలెస్ట్రాల్ , అధిక ట్రైగ్లిజరైడ్‌ల స్థాయిలు పెరుగుతాయి. 


కొవ్వును తగ్గించండి. 

మీ గుండె జబ్బలు ప్రమాదాన్ని తగ్గించడానికి కొవ్వ కలిగిన పదార్థాలకు దూరంగా ఉండాలి. పాల ఉత్పత్తులను తగ్గించి తీసుకోవాలి. పౌల్ట్రీ, గొడ్డు మాంసం, అధిక కొవ్వు కలిగిన వెన్న, జున్ను, పామాయిల్ , పామ్ కెర్నల్ ఆయిల్ కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం ఉత్తమం. ఆలివ్, సోయాబీన్, గింజలు, కనోలా నూనెలు, సముద్రపు ఆహారంలో ఉండే కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి.


మితంగా తీసుకోండి..

మితమైన ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొన్ని హృదయ సంబంధ వ్యాధులు, ముఖ్యంగా కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు చెపుతున్నాయి. మితమైన ఆల్కహాల్ తీసుకోవడం మంచిది.


సరైన అలవాట్లు, వేళకు నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం గుండెకు మేలు చేస్తుంది. 

Updated Date - 2022-09-08T19:02:57+05:30 IST