restful sleep: రాత్రి ప్రశాంతమైన నిద్రకోసం ఈ ఎఫెక్టివ్ ట్రిక్స్ ఫాలో కండి..!

ABN , First Publish Date - 2022-10-29T10:58:27+05:30 IST

వేళకాని వేళలో నిద్రపోవడం వల్ల రాత్రి సరైన సమయానికి నిద్ర రాదు. తక్కువ సమయం నిద్రకీ టైప్ 2 డయాబెటీస్ కీ సంబంధం ఉందని అధ్యయనాలు చెపుతున్నాయి.

restful sleep: రాత్రి ప్రశాంతమైన నిద్రకోసం ఈ ఎఫెక్టివ్ ట్రిక్స్ ఫాలో కండి..!
restful sleep

తక్కువ నిద్ర అనేది సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్య మెదడును సరిగా పనిచేయనీదు. నిద్ర సరిగా లేని వారు రోజంతా గందరగోళంగా, చికాకుగా ఉంటారు. అంతే కాకుండా తక్కువ నిద్రపోయేవారిలో రక్తపోటులో హెచ్చుతగ్గులు, స్ట్రోక్, గుండె జబ్బులు, ఊబకాయం పెరగటంతో పాటు బరువు పెరగడంలోనూ, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుదలలో కూాడా మార్పులు సంభవిస్తాయి.

ప్రతిరోజూ దాదాపు 7 నుంచి 8 గంటలకన్నా తక్కువ నిద్ర ఉన్నవారిలో గుండె సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి ఆరోగ్యకరమైన వారిలో కూడా ప్రీడయాబెటిస్‌కి కారణం కావచ్చు. దీనికి ప్రత్యమ్నాయంగా పగటి పూట నిద్రపోయే అలవాటును తగ్గించాలి. వేళకాని వేళలో నిద్రపోవడం వల్ల రాత్రి సరైన సమయానికి నిద్ర రాదు. తక్కువ సమయం నిద్రకీ టైప్ 2 డయాబెటీస్ కీ సంబంధం ఉందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఆరోగ్యకరమైన నిద్ర అలవాటు లేకపోతే అది డిప్రెషన్ కి కారణం కావచ్చు.

రాత్రి సమయంలో కాఫీ టీలను మానేయాలి. వీటి వల్ల నిద్ర ఆలస్యం అవుతుంది. గోరువెచ్చని పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది. నిద్ర సమయంలో ఎలాంటి పనిని పెట్టుకోకూడదు. ఉదయం లేచి చేయాల్సిన పనిని పదే పదే మనసులో అనుకోవడం వల్ల కూడా నిద్ర తగ్గుతుంది. దాని స్థానంలో ఒత్తిడి మొదలవుతుంది.

అంతే కాకుండా ఆల్కహాల్, సిగరెట్ వంటివి తీసుకున్నా కూడా నిద్ర సరైన సమయానికి రాదు. కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల నిద్ర సమయం తగ్గుతుంది. నిద్రరాని సమయాల్లో పాజిటివ్ ఆలోచనలు చేయండి. మృదువైన సంగీతాన్ని వినడం, నచ్చిన పుస్తకం చదవడం, రిలాక్స్ కావడం వల్ల చక్కని నిద్ర వస్తుంది. పడుకునే గదిలో పాజిటివ్ నెస్ ఉండేలా చూసుకోవాలి. నచ్చిన కలర్ కర్టెన్స్, దుప్పట్లు ఉండేట్టు చూసుకోవాలి. దిండ్లు మెత్తగా ఉండేలా, పరుపు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

Updated Date - 2022-10-29T11:00:06+05:30 IST