Do you feel constipated after eating millets? : మిల్లెట్స్ తో మలబద్దకం వస్తుందా? అయితే ఇలా చేయండి.

ABN , First Publish Date - 2022-09-07T17:19:45+05:30 IST

ఫైబర్, అమైనో ఆమ్లాలు, మిటమిన్ బి వంటి అనేక ముఖ్య ఖనిజాలు పుష్కలంగా ఉన్న మిల్లెట్లను తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

Do you feel constipated after eating millets? : మిల్లెట్స్ తో మలబద్దకం వస్తుందా? అయితే ఇలా చేయండి.

మిల్లెట్స్ తిన్న తరువాత చాలామందిలో మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  ఫైబర్, అమైనో ఆమ్లాలు, మిటమిన్ బి వంటి అనేక ముఖ్య ఖనిజాలు పుష్కలంగా ఉన్న మిల్లెట్లను తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇవి కొందరిలో ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతున్నాయి. అసలు మిల్లెట్స్ ను ఏలా తీసుకోవాలి. 


పౌష్టికాహారం తీసుకోవడంపై అవగాహన జనాల్లో చాలావరకూ పెరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన పూర్వీకులు ఉపయోగించిన చాలా పద్దతులను ఇప్పుడు మనం అంతా మళ్ళీ పాటిస్తున్నాం. ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మునుపటిలా మార్చుకునేందుకు అంతా ప్రయత్నిస్తున్నారు. 


దీనిలో ముఖ్యంగా తృణధాన్యాలను తీసుకునే విధానాన్ని చాలావరకూ షుగర్ వ్యాధి ఉన్నవారు, బిపీ తో బాధపడేవారు తీసుకుంటున్నారు. ఫైబర్, అమైనో ఆమ్లాలు, విటమిన్ బి వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్న మిల్లెట్ల ను తీసుకుంటున్నారు. అయితే అందరిలో కాకపోయినా కొందరిలో మిల్లెట్లను తీసుకోవడం వల్ల మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటినుంచి ఉపశమనానికి ఏం చేయాలంటే...


మిల్లెట్ల వల్ల మలబద్దకాన్ని, కడుపు ఉబ్బరాన్ని నివారించాలంటే ఇలా చేయండి.


మిల్లెట్లతో కలిగే మలబద్దకం, ఉబ్బరం పోవాలంటే.. 

1. వాటిని ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి. 

2. వండేప్పుడు నెయ్యి, రాళ్ళ ఉప్పు, ఎండిన అల్లం పొడిని వేయాలి.

3. మిల్లెట్ మీల్స్ తినేప్పుడు, అందులో ఉడికించిన కూరగాయలను ఎక్కువగా కలిపి తీసుకుంటే మంచిది.

Updated Date - 2022-09-07T17:19:45+05:30 IST