Almonds: కార్డియో వాస్కులర్ రక్కసి నుంచి బాదాములతో గుండెకు రక్ష

ABN , First Publish Date - 2022-09-24T23:12:31+05:30 IST

ప్రతి ఏడాది సెప్టెంబరు 29ని ప్రపంచ హృదయ దినోత్సవంగా జరపుకుంటారు. తద్వారా కార్డియో వాస్క్యులర్‌ వ్యాధులు (CVD),

Almonds: కార్డియో వాస్కులర్ రక్కసి నుంచి బాదాములతో గుండెకు రక్ష

ప్రతి ఏడాది సెప్టెంబరు 29ని ప్రపంచ హృదయ దినోత్సవంగా జరపుకుంటారు. తద్వారా  కార్డియో వాస్క్యులర్‌ వ్యాధులు (CVD), వాటి ప్రభావంపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అత్యధిక మరణాలకు సీవీడీ కూడా ఒక కారణం.  నిపుణుల అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక  సీవీడీ మరణాలు మన దేశంలోనే నమోదు కానున్నాయి. వచ్చి మీద పడబోతున్న ఆరోగ్య సంక్షోభాన్ని గుర్తించి, ఎదుర్కోవాలనే ప్రయత్నాలలో భాగంగా ఈ ఏడాది ప్రపంచ హృదయ దినోత్సవ నేపథ్యంగా ‘యూజ్‌ హార్ట్‌ ఫర్‌ ఎవ్రీ హార్ట్‌’ను ఎంచుకున్నారు.  


కరోనా మహమ్మారి తర్వాత మన ప్రాధాన్యాలు, జీవన శైలిలో మార్పు వచ్చింది. నిజానికి మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం ఎలా ఉండాలో చెబుతుంది. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడంలో ఆహారం ప్రాముఖ్యతను ఇది వెల్లడిస్తుంది. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ 42 గ్రాముల బాదాములను స్నాక్‌గా తీసుకుంటే అది గుండె సంబంధిత వ్యాధుల  ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అదనంగా బాదములను స్నాకింగ్‌ను తీసుకుంటే గుండె వ్యాధులకు కారణమయ్యే ఉదరం దగ్గర చేరే కొవ్వు తగ్గుతుంది. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన డైట్‌ను ఎంచుకోవాలి. ఇందులో భాగంగా మనం తీసుకునే ఆహారంలో గుప్పుడు బాదంపప్పును జోడించుకోవాలి. బాదములలో వైవిధ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి గుండెకు ఆరోగ్యాన్ని అందిస్తాయి.


ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరావాలా గుండెకు సంబంధించిన ఆరోగ్యంపై మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, చురుకైన జీవనశైలి వంటివి గుండె ఆరోగ్యానికి కీలకమని చెప్పుకొచ్చారు. వ్యాయాయాల వల్ల ఎండార్ఫిన్లు, డోపమైన్‌ విడుదలవుతాయి. తద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని అన్నారు. కాబట్టి షెడ్యూల్‌లో కనీసం 30 నిమిషాలు ఈ వ్యాయామాల కోసం కేటాయించాలని సూచించారు. అలాగే, తగిన శక్తిని అందించే బాదములు లాంటి ఆహారాన్ని డైట్‌లో జోడించుకోవాలని సూచించారు. బాదములలో విస్తృత శ్రేణిలో పోషకాలు ఉన్నాయని, ఇవి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయని చెప్పారు.


న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ.. యువతలో సీవీడీ కేసులు క్రమంగా పెరుగుతున్నట్టు చెప్పారు. సీవీడీ రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ అయిన ఊబకాయం, హైపర్‌టెన్షన్‌, మధుమేహం వంటివి భారతీయులలో ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. దీనిని అధిగమించాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. చురుకుగా ఉండటంతో పాటుగా వర్కవుట్స్‌ కూడా  చేయాల్నారు.  ఆహారం మీ శరీరంపై చూపే ప్రభావం తెలుసుకోవడమూ కీలకమని పేర్కొన్నారు. కొలెస్ట్రాల్‌, సోడియం, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలకు బదులుగా  ఆరోగ్యవంతమైన అవకాశాలను ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. డైట్‌లో బాదములను భాగంగా చేసుకోవడం ద్వారా సీవీడీ ప్రమాదాలను నివారించొచ్చన్నారు. అత్యధిక ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిసరైడ్‌ స్ధాయిలు, లో హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలకు కారణమయ్యే డిస్లిపిడెమియాను భారతీయులు నియంత్రణలో ఉంచుకునేందుకు బాదములు కొంత మేర సహాయపడతాయని షీలా కృష్ణస్వామి పేర్కొన్నారు.

Read more