గోళ్ల గోడు! అశ్రద్ధ చేయకూడదు

ABN , First Publish Date - 2022-09-20T17:35:10+05:30 IST

గోళ్లు మన ఆరోగ్యానికి ప్రతిబింబాల్లాంటివి. వాటిలో తలెత్తే తేడాలు మనలో దాగి ఉన్న రుగ్మతలను తెలుపుతాయి. కాబట్టి గోళ్లలో మార్పులను అశ్రద్ధ చేయకూడదు.

గోళ్ల గోడు! అశ్రద్ధ చేయకూడదు

గోళ్లు మన ఆరోగ్యానికి ప్రతిబింబాల్లాంటివి. వాటిలో తలెత్తే తేడాలు మనలో దాగి ఉన్న రుగ్మతలను తెలుపుతాయి. కాబట్టి గోళ్లలో మార్పులను అశ్రద్ధ చేయకూడదు.

  • తెల్ల పట్టీలు: ‘మోర్క్స్‌ నెయిల్స్‌’ అనే స్థితిలో గోళ్ల మీద అడ్డంగా రెండు తెల్లని పట్టీలు ఏర్పడతాయి. ఇవి కేన్సర్‌ చికిత్సలో ఇచ్చే కీమోథెరపీ వల్ల ఏర్పడవచ్చు, లేదా కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధుల వల్ల కూడా తలెత్తవచ్చు. 
  • గోరు కిందకి వంగిపోవడం: ‘నెయిల్‌ క్లబ్బింగ్‌’ అనే ఈ స్థితిలో సాధారణంగా చివర్లో కొద్దిగా పైవైపుకి తిరగాల్సిన గోళ్లు, కింది వైపుకు వంగి ఉంటాయి. కాలేయ వ్యాధులు, హృద్రోగాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ సిండ్రోమ్‌, హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు గోళ్లు ఇలా వంగిపోయే అవకాశం ఉంటుంది.
  • ఎర్ర గీతలు: ‘బ్యూస్‌ లైన్స్‌’ అనే ఈ గీతలు గోళ్లకు గాయమైనా, కీమోఽథెరపీ తీసుకుంటున్నా, విపరీతమైన జ్వరం వచ్చినా, మధుమేహం, పెరిఫెరల్‌ వ్యాస్క్యులర్‌ డిసీజ్‌ వచ్చినా, జింక్‌ లోపమున్నా కనిపిస్తాయి.
  • స్పూన్‌ నెయిల్స్‌: ‘కాయిలోనైఖియా’ అనే ఈ సమస్యలో గోళ్లు పలచగా, చదునుగా ఉంటాయి. కొంతమందిలో గోరు మధ్యలో లోపలికి వంగిపోయి ఉంటాయి. ఈ సమస్య విపరీతమైన ఐరన్‌ లోపం, పదేపదే పేలుడు, ట్రామాకు గురవడం వల్ల తలెత్తుతుంది.
  • తెల్ల గోళ్లు: ‘టెర్రీస్‌ నెయిల్స్‌’ అనే ఈ సమస్యలో గోళ్లు తెల్లగా, అంచుల్లో ముదురు రంగు పట్టీలు ఏర్పడతాయి. కంజెస్టివ్‌ హర్ట్‌ ఫెయిల్యూర్‌, మధుమేహం, హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్లలో గోళ్లు ఇలా మారే వీలుంది.

Read more