World Alzheimer’s Day 2022: అల్జీమర్స్‌ను నియంత్రించే నాటు పుట్టగొడుగులు..!

ABN , First Publish Date - 2022-09-21T20:04:57+05:30 IST

అల్జీమర్స్ అనేది మన మెదడుకు సంబంధించిన వ్యాధి, ఇది జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.

World Alzheimer’s Day 2022: అల్జీమర్స్‌ను నియంత్రించే నాటు పుట్టగొడుగులు..!

ప్రపంచ అల్జీమర్స్ డే 2022: మనం తినే పుట్టగొడుగులలో అనేక రకాల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. అల్జీమర్స్ అనేది మన మెదడుకు సంబంధించిన వ్యాధి, ఇది జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. ఈ వ్యాధి పెరుగుతున్నప్పుడు మామూలుగా రోజువారి చేసుకునే పనులను కూడా మరిచిపోతారు. ప్రతి పనికి ఇతరులపై ఆధారపడటం జరుగుతుంది. 


మామూలుగా మనం ఆహారంలో తీసుకునే పుట్టగొడుగులలో చాలా రకాలున్నాయి. వీటిలో సహజంగా పెరిగే నాటు పుట్టగొడుగులతో అల్జీమర్స్ వ్యాధిని తగ్గించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఈ పుట్టగొడుగుల్లో అల్జీమర్స్ వ్యాధిని తగ్గించి మెదడు న్యూరాన్ పెరుగుదలను ప్రోత్సహించే బయోయాక్టివ్ పదార్థాలు ఉన్నాయని మరిన్ని పరిశోధనలు తెలిపాయి. 


ఈ మెడిసినల్ పుట్టగొడుగులు న్యూరోఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం, నరాల పెరుగుదల కారకాలను పెంచడం ద్వారా జ్ఞాపకశక్తిని, మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి సూపర్‌ఫుడ్‌ గా పనిచేస్తుంది. అంతేకాదు ఈ యాంటీఆక్సిడెంట్స్ శరీరం దాని స్వంత ఎండోజెనస్ యాంటీఆక్సిడెంట్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. 

 

1. న్యూరల్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

2. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


అల్జీమర్స్‌ను నియంత్రించడంలో పుట్టగొడుగులు సహాయపడతాయా?

1. పుట్టగొడుగులు మెదడులోని కొత్త నరాల కణాల అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి.

2. అల్జీమర్స్‌కు కారణమయ్యే టాక్సిన్స్ నుంచి రక్షించవచ్చు.

3. ఈ పుట్టగొడుగుల్లో విటమిన్ D పుష్కలంగా లభిస్తుంది. 

4. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, ఆరోగ్యకరమైన మెదడుకు ఉత్తమమైన సూపర్‌ఫుడ్‌ల జాబితాలో పుట్టగొడుగులను తినడం, వాటిని ఔషధంగా ఉపయోగించడం మేలు చేస్తుందని చెపుతుంది.

Updated Date - 2022-09-21T20:04:57+05:30 IST