ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆవిష్కరించిన అన్వి ఫెర్టిలిటీ అండ్ ఉమెన్స్ సెంటర్

ABN , First Publish Date - 2022-04-21T22:15:20+05:30 IST

మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని అన్నారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. గురువారం హైదరాబాద్, శివమ్ రోడ్‌లోని తిలక్ నగర్‌లో డాక్టర్ స్వర్ణ నేతృత్వంలో ఏర్పాటైన అన్వి ఫెర్టిలిటీ అండ్ ఉమెన్స్ సెంటర్‌ని

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆవిష్కరించిన అన్వి ఫెర్టిలిటీ అండ్ ఉమెన్స్ సెంటర్

మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని అన్నారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. గురువారం హైదరాబాద్, శివమ్ రోడ్‌లోని తిలక్ నగర్‌లో డాక్టర్ స్వర్ణ నేతృత్వంలో ఏర్పాటైన అన్వి ఫెర్టిలిటీ అండ్ ఉమెన్స్ సెంటర్‌ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందించడం అభినందనీయమని తెలుపుతూ.. డాక్టర్ స్వర్ణ అండ్ టీమ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా డాక్టర్ స్వర్ణ మాట్లాడుతూ.. ‘‘మాతృత్వం ఒక వరం.. ఏ స్త్రీ కైనా గొప్ప ఆనందం. మారుతున్న జీవన విధానం, వాతావరణంలో మార్పులు, వృత్తిపరమైన జీవితం, పెరిగిన ఒత్తిడి వంటివి సంతానలేమికి ప్రధాన కారణమవుతున్నాయి. అన్వి ఫెర్టిలిటీ అండ్ ఉమెన్స్ సెంటర్ ద్వారా సంతానలేమికి కారణాలను ఆధునిక వైద్య విధానాల సహాయంతో కనుగొని.. వైద్య శాస్త్రంలోని లేటెస్ట్ సాంకేతిక ఆవిష్కరణల ద్వారా తగిన చికిత్సను అందించడం జరుగుతుంది. అత్యాధునిక అడ్వాన్స్ ఐవీఎఫ్ సిస్టమ్‌తో పాటు.. ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో అన్నిరకాల ప్రాబ్లమ్స్‌కి అన్వి ఫెర్టిలిటీ అండ్ ఉమెన్స్ సెంటర్ నందు ట్రీట్‌మెంట్ అందించడం జరుగుతుంది..’’ అని అన్నారు.

Read more