బరువు తగ్గించే గ్రీన్‌ టీ

ABN , First Publish Date - 2022-03-23T05:30:00+05:30 IST

కైమేలియా సైనెన్సిన్‌ అనే మొక్క ఆకులతో గ్రీన్‌ టీ తయారు చేస్తారు. గ్రీన్‌ టీ తాగడం ఫ్యాషన్‌ అనుకోవద్దు. ఎంతో ప్రయోజనముంది....

బరువు తగ్గించే గ్రీన్‌ టీ

కైమేలియా సైనెన్సిన్‌ అనే మొక్క ఆకులతో గ్రీన్‌ టీ తయారు చేస్తారు. గ్రీన్‌ టీ తాగడం ఫ్యాషన్‌ అనుకోవద్దు. ఎంతో ప్రయోజనముంది. ఫిట్‌నెస్‌ మంత్ర పాటించేవాళ్లంతా గ్రీన్‌ టీకే ఓటేస్తారు.


గ్రీన్‌టీ ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి. ఈ ఆర్గానిక్‌ పదార్థాల వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆరోగ్యంమీద శ్రద్ధ ఉండే వాళ్లు గ్రీన్‌టీతో దోస్తీ చేస్తుంటారు. రోజుకు మూడు కప్పుల గ్రీన్‌టీ తాగితే స్ర్టోక్‌తో పాటు గుండెపోటు కలగదని పరిశోధనలు చెబుతున్నాయి.


ఫిట్‌నె్‌స మీద దృష్టిపెట్టే వారు గ్రీన్‌టీని ఆశ్రయించాల్సిందే. ఇందులోని యాంటీయాక్సిడెంట్స్‌, మాంగనీసు, క్యాల్షియం, విటమిన్‌ -సి, మెటబాలిజమ్‌ను పెంచుతాయి. కొవ్వు తరిగిపోయేట్లు చేస్తుంది. బరువు తగ్గిపోతారు. 


నోటిలో దుర్గంధం పోతుంది. దంతాల చుట్టూ పేరుకుపోయిన బ్యాక్టీరియా, వైర్‌సను చంపేసి దంత సంరక్షణకు మంచి జరుగుతుంది. జుట్టురాలటం తగ్గిపోతుంది.


నిమ్మ, తేనె, అల్లం, తులసి.. ఇలా రకరకాల ఫ్లేవర్స్‌లో గ్రీన్‌టీ మార్కెట్లో దొరుకుతోంది. తులసి ఫ్లేవర్‌ ఉండే గ్రీన్‌టీ తాగితే కడుపులో కలిగే సమస్యలు తొలగిపోతాయి. లెమన్‌ గ్రీన్‌టీ తాగితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. కడుపులో ఉండే అసిడిటీ, తేన్పులు లాంటివి పోవాలంటే అల్లం, తేనె ఫ్లేవర్‌ ఉండే గ్రీన్‌టీని తాగితే సరి.


వ్యాయామానికి ముందు గ్రీన్‌టీ తాగాలి. మంచి ఫలితాన్నిస్తుంది. ఖాళీ కడుపున ఉన్నప్పుడు, టిఫెన్‌ తిన్న తర్వాత, భోజనం అయ్యాక వెంటనే తాగకూడదు. రాత్రిపూట తాగితే నిద్రపట్టక వేరే ఇబ్బందులొస్తాయి. 

Read more