ఎముకల గట్టితనానికి...

ABN , First Publish Date - 2022-09-29T09:39:12+05:30 IST

బొప్పాయి పండు అన్ని కాలాల్లో దొరుకుతుంది. ఈ పండు ఆరోగ్యానికెంతో మంచిది. ఈ పండులో నీటిశాతం ఎక్కువ ఉంటుంది.

ఎముకల గట్టితనానికి...

బొప్పాయి పండు అన్ని కాలాల్లో దొరుకుతుంది. ఈ పండు ఆరోగ్యానికెంతో మంచిది. ఈ పండులో నీటిశాతం ఎక్కువ ఉంటుంది. ఫైబర్‌ ఉంటుంది. సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో పొటాషియం వల్ల గుండె ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తుంది. మజిల్స్‌ మూమెంట్‌కి, శరీరంలోని వాపుల్ని పోగొట్టే లక్షణం వీటికి ఉంది. ఎముకల్లో గట్టితనం వస్తుంది. బొప్పాయి పండును మెత్తగా చూర్ణం చేసి గాయాలకు పట్టిస్తే తగ్గిపోతుంది. ఇందులో విటమిన్‌-సి ఉండటం వల్ల కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేసి తద్వారా జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. డయాబెటి్‌సతో బాధపడేవాళ్లు కూడా తినొచ్చు. కంటి ఆరోగ్యంతో పాటు వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది.

Updated Date - 2022-09-29T09:39:12+05:30 IST