డబుల్‌ హ్యాట్రిక్‌ కోసం...

ABN , First Publish Date - 2022-09-25T06:54:18+05:30 IST

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల... వైకుంఠపురములో....’ ఇలా హ్యాట్రిక్‌ చిత్రాలతో అలరించారు అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌.

డబుల్‌ హ్యాట్రిక్‌ కోసం...

జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల... వైకుంఠపురములో....’ ఇలా హ్యాట్రిక్‌ చిత్రాలతో అలరించారు అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌. వీళ్ల కాంబో అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పైగా ‘అల..’ తరవాత అవి మరింతగా పెరిగాయి. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయబోతున్నట్టు టాలీవుడ్‌ టాక్‌. అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ల మధ్య ఇటీవల స్ర్కిప్టుకి సంబంధించిన చర్చలు జరిగాయని సమాచారం. వీరిద్దరూ మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారని, త్వరలోనే ఈ విషయాలు అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప 2’ పనుల్లో బిజీగా ఉన్నారు బన్నీ. అక్టోబరులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్‌ కూడా మహేశ్‌ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యేసరికి బన్నీ ఫ్రీ అయిపోతారు. ఆ వెంటనే.. ఈ కాంబోలో సినిమా మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బన్నీ గురించి తమిళ దర్శకుడు అట్లీ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. త్రివిక్రమ్‌ సినిమా అయిన తరవాతే అట్లీకి కాల్షీట్లు ఇవ్వొచ్చని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. 

Read more