మధుమేహులు పండ్లు తినొచ్చా?

ABN , First Publish Date - 2022-10-04T05:30:00+05:30 IST

విటమిన్లు, ఖనిజ లవణాలు, పాలీఫినోలిక్‌ ఫ్లేవనాయిడ్స్‌, యాంథోసయానిన్స్‌ మొదలైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉండే పండ్లు నిస్సందేహంగా

మధుమేహులు పండ్లు తినొచ్చా?

ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌


విటమిన్లు, ఖనిజ లవణాలు, పాలీఫినోలిక్‌ ఫ్లేవనాయిడ్స్‌, యాంథోసయానిన్స్‌ మొదలైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉండే పండ్లు నిస్సందేహంగా ఆరోగ్యకరమైనవే! అయితే పండ్లు తినడంలో మధుమేహులు కొన్ని పరిమితులు పాటించక తప్పదు. అవేంటంటే...


మధుమేహులు అన్ని పండ్లనూ తినవచ్చు. అయితే వాటి జిఐ (గ్లైసెమిక్‌ ఇండెక్స్‌) ఆధారంగా తినే పరిమాణాల్లో పరిమితులు పాటించాలి. త్వరగా శోషణ చెంది, రక్తంలోని చక్కెరలను పెంచే తత్వమే గ్లైసెమిక్‌ ఇండెక్స్‌. ఇది కొన్ని పండ్లలో ఎక్కువగా, కొన్నింటిలో తక్కువగా ఉంటుంది. ఆ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే, రక్తంలో చక్కెర అంతే ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి  చక్కెరను అదుపులో ఉంచే పీచుతో కూడిన పండ్లను ఎంచుకోవాలి. సాల్యుబుల్‌ ఫైబర్‌ చక్కెర శోషణను నెమ్మదించేలా చేస్తుంది. పైగా పీచుతో కూడిన పండ్లతో త్వరగా కడుపు నిండిపోతుంది. కాబట్టి తక్కువ తింటాం. పైగా ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువ. మలబద్ధకంతో బాధపడే వారికి ఇలాంటి పండ్లు ఉపయోగకరం. 

Updated Date - 2022-10-04T05:30:00+05:30 IST