Ear Buds : స్కల్‌కాండీ మాడ్‌ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌

ABN , First Publish Date - 2022-12-10T00:08:22+05:30 IST

అటు ఫోన్‌, ఇటు ల్యాప్‌టాప్‌నకు ఒకేసారి కనెక్టివిటీకి ఉపయోగపడే విధంగా స్కల్‌కాండీ మాడ్‌ - ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ ఉన్నాయి.

Ear Buds : స్కల్‌కాండీ మాడ్‌ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌

అటు ఫోన్‌, ఇటు ల్యాప్‌టాప్‌నకు ఒకేసారి కనెక్టివిటీకి ఉపయోగపడే విధంగా స్కల్‌కాండీ మాడ్‌ - ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ ఉన్నాయి. చుంకీ డిజైన్‌తో బ్లాక్‌, గ్రే రంగుల్లో లభ్యమవుతున్నాయి. చెవికి బాగా అమిరేవిధంగా ఉండటమే కాకుండా కిట్‌లో మూడు జతల సిలికాన్‌ ఇయర్‌ టిప్స్‌ ఉన్నాయి. అంతర్గతంగా 6ఎంఎం డైనమిక్‌ డ్రైవర్స్‌ ఉన్నాయి. అవి 20హెచ్‌ జెడ్‌ నుంచి 20 కెహెచ్‌జడ్‌ ఫ్రీక్వెన్సి రెస్పాన్స్‌ కలిగి ఉన్నాయి. మల్టీపాయింట్‌ కనెక్టివిటీ ఉంది. దాంతో వేర్వేరు డివైస్‌ల(సెల్‌, ల్యాప్‌టాప్‌)తో ఒకే సమయంలో కనెక్ట్‌ కావచ్చు. టచ్‌ సెన్సటివ్‌ బటన్‌ ఇయర్‌బడ్‌ టాప్‌లో ఉంది. అదే ప్లేబ్యాక్‌, పాజ్‌ను కంట్రోల్‌ చేస్తుంది. లైట్‌ టచ్‌తో మాత్రం రెస్పాండ్‌ కావడం లేదు. సింగిల్‌ టచ్‌తో ట్రాక్‌ మార్చుకోవచ్చు. డబుల్‌ ప్రెస్‌తో వాల్యూమ్‌ని సర్దుబాటు చేసుకోవచ్చు. అటు లేదా ఇటు ట్రాక్‌ కోసం రెండు వైపులా ఉన్న ఇయర్‌ పీసుల్లో ఒక సెకెను హోల్డ్‌ డౌన్‌ చేయాలి. మూడు సెకెండ్ల సేపు ప్రెస్‌ చేసి ఉంచితే కరెంట్‌ డివైస్‌ కనెక్షన్‌ కట్‌ అవుతుంది. సౌండ్‌ క్వాలిటీ బాగుంది. డ్రమ్స్‌లో ప్రతి బీట్‌ను చక్కగా వినొచ్చు. కంప్యూటర్లు, మొబైల్‌ డివైస్‌ల యూజర్ల సౌలభ్యం కోసం మిక్‌ టెక్నాలజీని ఉపయోగించారు. బ్యాటరీ ఏడు నుంచి తొమ్మిది గంటల సేపు నిరంతరంగా పనిచేస్తుంది. మరో 27గంటలు కలుపుకోవచ్చు. పసుపుపచ్చ రంగులో ఉంటే బ్యాటరీ 95 శాతం మేర చార్జ్‌ అయినట్టు భావించాలి. అదే ఎరుపు రంగులో ఉంటే 40 శాతం మేర చార్జింగ్‌ అయినట్టు లెక్క.

Updated Date - 2022-12-10T00:08:23+05:30 IST